Ravi Babu: మా నాన్న.. చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా చనిపోయారు
సెలబ్రెటీలే కాని.. కామన్ పీపులే కాని.. ఎవరైనా కాని...! భవబంధాలను పక్కకు పెడితే.. చాలా ప్రశాంతమైన చావే రావాలని కోరకుంటారు. నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాలనుకుంటారు. మంచానికి పరిమితమయ్యో...
సెలబ్రెటీలే కాని.. కామన్ పీపులే కాని.. ఎవరైనా కాని…! భవబంధాలను పక్కకు పెడితే.. చాలా ప్రశాంతమైన చావే రావాలని కోరకుంటారు. నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాలనుకుంటారు. మంచానికి పరిమితమయ్యో… తన వారితో సేవ చేయించుకుంటూనో.. రోగిగా అవమాన పడుతూనో.. చేదు మందు బిల్లలు మింగుతూనో.. మరణించకూడదనుకుంటారు. ఇలా అందరూ అనుకున్నట్టే.. తన తండ్రి నటులు చలపతిరావు కూడా ప్రశాంతంగా మరణించారని అంటున్నారు ఆయన కొడుకు రవిబాబు. ఎస్ ! తనకిస్టమైన మాంచి చికెన్ బిర్యానీ తిని.. నొప్పి తెలియకుండా చాలా ప్రశాంతంగా వెళ్లిపోయారని మా నాన్న! అని మీడియాతో చెబుతూ ఎమోషనల్ అయ్యారు రవిబాబు. అంతేకాదు తన తండ్రి నిన్న రాత్రి అంటూ.. డిసెంబర్ 24 రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కన్ను మూశారన్నారు రవిబాబు. తన సిస్టర్స్ అమెరికా నుంచి రాగానే అంత్యక్రియలు జరిపిస్తామని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: