ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్‌ !!

రాధేశ్యామ్ థియేటర్ ముందు తడబడినా... ఓటీటీలో మాత్రం దూసుకుపోతున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఓటీటీపైకి దండయాత్ర చేసేలా చేశాడు.

ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్‌ !!

|

Updated on: Apr 03, 2022 | 8:52 AM

రాధేశ్యామ్ థియేటర్ ముందు తడబడినా… ఓటీటీలో మాత్రం దూసుకుపోతున్నారు. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఓటీటీపైకి దండయాత్ర చేసేలా చేశాడు. రాధేశ్యామ్‌ సినిమాను ఓటీటీలో పెట్టిన మరుక్షణం ఒక్కసారిగా చూసే ప్రయత్నం చేశారు. పాన్ ఇండియా మూవీగా దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య థియేటర్లలో రిలీజ్‌ అయింది. కాని క్లాసికల్‌ సబ్జెక్ట్ లో ప్రభాస్‌ని ఊహించుకోలేని డార్లింగ్ ఫ్యాన్స్ అండ్‌ ఫాలోవర్స్… ఈ సినిమా పై పెదవి విరిచారు. ఫీల్‌ గుడ్‌ ఫిల్మ్ అంటూనే డార్లింగ్ చేయాల్సిన సినిమా కాదంటూ స్టేట్మెంట్‌ ఇచ్చారు.

Also Watch:

RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్‌ చేసిన విజయేంద్రప్రసాద్

Follow us