అర్ధ రూపాయి వ్యాపారంలో.. నీదో పావలా.. నాదో పావలా!
థియేటర్ల ఇష్యూపై స్టార్ ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న క్రమంలో.. బన్నీ వాసు మాత్రం సింపుల్‌గా ఓ ట్వీట్ చేశారు. కానీ అందులో మాత్రం థియేటర్ల ఇష్యూపై... పర్సంటేజ్ విధానంపై తన ఓపీనియన్ కాస్త స్ట్రెయిట్ గానే చెప్పారు. ఇప్పుడా ట్వీట్‌తో నెట్టింట వైరల్ కూడా అవుతున్నారు ఈ నయా స్టార్ ప్రొడ్యూసర్. పర్సెంటేజీ విధానం గురించి మాట్లాడటం కన్నా.. ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలోనని ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు బన్నీ వాసు.
ఇక్కడ ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదన్నారు ఆయన. ముందు ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని.. ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడంలో అర్థం లేదన్నారు బన్నీవాసు. మునుపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలని సూచించారు. సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంపై పెద్ద హీరోలు కూడా ఆలోచించాలని తన ట్వీట్లో రాసుకొచ్చారు ఈయన.
మరిన్ని వీడియోల కోసం :