Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంగవ్వకు ఇన్ని కష్టాలా? పాపం గంగవ్వ! కష్టాలు చెబుతూ బోరున ఏడుపు!

గంగవ్వకు ఇన్ని కష్టాలా? పాపం గంగవ్వ! కష్టాలు చెబుతూ బోరున ఏడుపు!

Samatha J

|

Updated on: Jun 06, 2025 | 3:22 PM

గంగవ్వ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం లేని పేరు. ఈమె పేరు చెబితే చాలు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు విరబూస్తుంది. బిగ్ బాస్ రియాలిటీ షో లోనూ సందడి చేసింది గంగవ్వ. ఒకటి కాదు ఏకంగా రెండు సార్లు ఈ రియాలిటీ షోలో సందడి చేసిందామె. తన దైన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను బాగా అలరించారు. అయితే వృద్ధాప్య సమస్యలకు తోడు ఆరోగ్య సమస్యలతో ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయారు. ఇప్పుడు సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటున్నారు.

2019లో వచ్చిన ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు గంగవ్వ. ఆ తర్వాత వరుస సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి మెప్పించారు. సిక్స్త్ సెన్స్ లాంటి టీవీ షోల్లోనూ సందడి చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గంగవ్వ తన జీవితం గురించి ఎవరకీ తెలియని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.తన పిల్లల గురించి ప్రశ్నించగా గంగవ్వ ఇలా సమాధానం చెప్పుకొచ్చారు.. తాను చిన్నతనంలోనే తల్లిదండ్రులని కోల్పోయానని.. ఒంటరిగానే ఆ నరక జీవితాన్ని కొనసాగించానంటూ ఎమోషనల్ అయ్యారు గంగవ్వ. అంతేకాదు పెళ్లయ్యాక మళ్లీ పిల్లల విషయంలో ఇద్దరిని కోల్పోయానని చెప్పారు. తనకు ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు.. అని చెప్పిన గంగవ్వ.. చిన్న వయసులోనే ఒక అబ్బాయి, అమ్మాయి చనిపోయారని చెప్పారు. అమ్మాయికి తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి చనిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు గంగవ్వ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. అందరినీ నవ్వించే గంగవ్వ జీవితంలో ఇన్ని కష్టలున్నాయా? అనే కామెంట్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ నుంచి వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

పెళ్లి చేసుకుని కేసు పెట్టించుకుంటారు.. వీరికేం మాయరోగం వీడియో

దూసుకొచ్చిన ఖడ్గమృగం… షాకైన పర్యాటకులు.. ఏం జరిగిందంటే వీడియో

వాష్ రూమ్‌కి వెళ్దామని డోర్ ఓపెన్ చేసిన వాచ్‌మెన్..దెబ్బకు వెన్నులో వణుకు వీడియో