వాష్ రూమ్‌కి వెళ్దామని డోర్ ఓపెన్ చేసిన వాచ్‌మెన్..దెబ్బకు వెన్నులో వణుకు వీడియో
వాష్ రూమ్ కి వెళ్దామని డోర్ ఓపెన్ చేసిన ఒక వ్యక్తికి లోపల షాకింగ్ సీన్ కనిపించింది. ఆ దృశ్యం చూడగానే అతనికి వెన్నులో వణుకు పుట్టింది. చెప్పుడు కాకుండా అక్కడి నుంచి ఒక్క ఉదుటున వెనక్కి వచ్చేశాడు. లోపల భారీ కొండ చిలువ కనిపించడంతో అతనికి గుండె ఆగినంత పని అయ్యింది. యధాలాపంగా లోపలికి వెళ్ళిపోయి ఉంటే అని అతను తలుచుకోగానే అతనికి ఒళ్ళు జలదరించింది. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. అర్ధరాత్రి 12 దాటింది. విశాఖలోని సాగర్ నగర్ ప్రాంతంలోని అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ వాష్ రూమ్ కి వెళ్దామని డోర్ తెరిచాడు.
చీకట్లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. లైట్ వేసి చూసేసరికి ఓ భారీ కొండ చిలువ లోపల తిష్ట వేసుకొని కూర్చుంది. దీంతో ఆ వాచ్ మెన్ కు గుండె ఆగినంత పని అయ్యింది. వెంటనే స్నేక్ కాచర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు స్నేక్ కాచర్ కిరణ్. సాగర్ నగర్ లో ఒక అపార్ట్ మెంట్ కింద సెల్లార్ లో బాత్రూమ్ లో స్నేక్ ఉందని మాకు కాల్ చేశారండి. ఆల్మోస్ట్ టైం 12:30 అవుతుంది. 30 డేట్. జస్ట్ రీచ్ అయ్యాను. 12 అడుగుల భారీ కొండ చిలువను బంధించేందుకు యత్నించాడు. రెస్క్యూ చేసి వాష్ రూమ్ నుంచి బయటకు తెస్తున్న క్రమంలో రెండు చేతులతో మెడను పట్టుకున్నాడు. దీంతో ఆ కొండ చిలువ కిరణ్ కాళ్ళకి చుట్టేసింది. దాని నుంచి విడిపించుకుంటూ మెల్లగా సెల్లార్ లోకి వచ్చిన కిరణ్ కుమార్ మరొకరి సహకారంతో కాళ్ళకి చుట్టిన కొండ చిలువను విడిపించుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
ఈసారి మరింత భయంకరంగా కరోనా? బాబా వంగా చెప్పినట్టే జరిగి తీరుతుందా? వీడియో
వామ్మో.. పాములతో కలిసి జీవిస్తున్న గ్రామస్తులు వీడియో
మిర్యాలగూడలో మిస్ 420..కూపీలాగితే ఖాకీలు సైతం షాకయ్యే క్రైమ్ వీడియో

విందులో మందు లేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్తులు వీడియో

జగిత్యాలలో ఎల్లో ఫ్రాగ్స్ కలకలం దేనికి సంకేతమో తెలుసా?వీడియో

వీడు మామూలోడు కాదు.. ప్రియురాలి కోసం.. వీడియో

వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వడమే

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..
