Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అజిత్ చేతిలో లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్‌ కార్‌ ధర తెలిస్తే .. దిమ్మ తిరిగిపోద్ది వీడియో

అజిత్ చేతిలో లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్‌ కార్‌ ధర తెలిస్తే .. దిమ్మ తిరిగిపోద్ది వీడియో

Samatha J

|

Updated on: Jun 06, 2025 | 3:21 PM

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇతర హీరోల మాదిరిగా కాదు. చాలా డిఫరెంట్. అజిత్ కు సినిమాలతో పాటు కార్ రేసింగ్ అంటే చాలా మక్కువ. అందుకే రెండింటికీ సరైన సమయం కేటాయిస్తున్నాడీ సీనియర్ హీరో. సినిమాల ద్వారా ఈ హీరో సంపాదించే డబ్బుతో ఖరీదైన కార్లను కొంటాడు. ఇప్పుడు అతని కార్ల కలెక్షన్‌లో మరో విలాసవంతమైన కారు కూడా చేరింది.అజిత్ కుమార్ మెక్‌లారెన్ సెన్నా కారు కొన్నాడు.

ఇది లిమిటెడ్ ఎడిషన్ అలాగే ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్. అందుకే మెక్‌లారెన్ సెన్నా కారు ధర చాలా ఖరీదైనది. అజిత్ కుమార్ మేనేజర్ సురేష్ చంద్ర ఈ కారు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అజిత్ కుమార్ మెక్‌లారెన్ సెన్నా కారు ముందు గర్వంగా పోజులిచ్చాడు. అజిత్ కుమార్ కొన్న మెక్‌లారెన్ సెన్నా కారు ఆకర్షణీయంగా ఉంది. ఎరుపు, వెండి రంగుల్లో ఉన్న ఆ కారు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కారును భారతదేశంలో కొనలేము. అందుకే దీనిని విదేశాల నుంచి కొనుగోలు చేశారు. ఈ కారు ధర సుమారు 6.75 కోట్ల రూపాయలు. ఈ క్రమంలో ఖరీదైన కారును సొంతం చేసుకున్నందుకు అభిమానులు అజిత్ కుమార్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అజిత్ కుమార్ దగ్గర ఉన్న రెండవ అత్యంత ఖరీదైన కారు మెక్‌లారెన్ సెన్నా. దీనికి ముందు, అతను ఫెరారీ SF90 కారును కొన్నాడు. దాని ధర సుమారు 9 కోట్ల రూపాయలు. అజిత్ కుమార్‌కు రేసింగ్ కార్లపై ఎంత క్రేజ్ ఉందో ఇదొక ఉదాహరణ. ఈ హీరోకు సొంత రేసింగ్ జట్టు ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వీడియోల కోసం :

పెళ్లి చేసుకుని కేసు పెట్టించుకుంటారు.. వీరికేం మాయరోగం వీడియో

దూసుకొచ్చిన ఖడ్గమృగం… షాకైన పర్యాటకులు.. ఏం జరిగిందంటే వీడియో

వాష్ రూమ్‌కి వెళ్దామని డోర్ ఓపెన్ చేసిన వాచ్‌మెన్..దెబ్బకు వెన్నులో వణుకు వీడియో