‘నా చివరి శ్వాస వరకు మళ్లీ అలా మాట్లాడను’ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ వీడియో
ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అలీని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. ఇదొక్కటే కాదు.. ఈ మధ్యన రాజేంద్ర ప్రసాద్ మాటలు బాగా కాంట్రవర్సీ అవుతున్నాయి. దీంతో చాలా మంది రాజేంద్రుడి తీరును తప్పుపడుతున్నారు.
‘అరే.. అవి తిట్లు కాదురా బాబు.. నా ప్రేమ అలాంటిది’ అని మొత్తుకున్నా రాజేంద్రుడిపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారీ సీనియర్ నటుడు. ఈ క్షణం నుంచి తన ఆఖరి శ్యాస వరకు ఇకపై ఎవరినీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడనని పేర్కొన్నారు.ఇంతకీ రాజేంద్ర ప్రసాద్ ఏం చెప్పారంటే! ‘నేను ఏదో చనువుతో సరదాగా అన్నాను. నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ప్రేమతో అన్నానని అలీ కూడా వివరణ ఇచ్చుకున్నాడు. హానెస్ట్ గా నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు. ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్లు యాక్టర్‌గా ఎలా ఉంటాను? అయితే ఇప్పుడు మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను. జీవితంలో ఇంకెప్పుడూ కూడా ఎవరినీ ఏకవచనంతో పిలవను. అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను అంటే… సీనియర్ ఎన్టీఆర్ నుంచి. ఆయన చిన్నవారిని కూడా నువ్వు అనే వారు కారు. మీరు అనే వారు. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను. ఇంకో రకంగా జీవితంలో ఇంకెప్పుడూ మాట్లాడను. నేను మాట్లాడిన వారంతా నా ఫ్యామిలీ మెంబర్స్’. అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లి చేసుకుని కేసు పెట్టించుకుంటారు.. వీరికేం మాయరోగం వీడియో
దూసుకొచ్చిన ఖడ్గమృగం… షాకైన పర్యాటకులు.. ఏం జరిగిందంటే వీడియో
వాష్ రూమ్‌కి వెళ్దామని డోర్ ఓపెన్ చేసిన వాచ్‌మెన్..దెబ్బకు వెన్నులో వణుకు వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

