ఐదేళ్లుగా సినిమాల్లేవ్…ఇప్పుడు ఒక్కో మూవీకి రూ. 40 కోట్లు వీడియో
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చితే హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాలు నామమాత్రమే. అటు.. బాలీవుడ్‌లోనూ మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్లకు సైతం సగటున ఓ మూవీకి ముట్టేది రూ. 10 కోట్లకు మించదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఈ ట్రెండ్‌ను తిరగరాస్తోంది.. ప్రియాంకా చోప్రా. ఐదేళ్ల నుంచి సినిమాల్లేక పోయినా.. ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ తీసుకుంటూ.. తానేంటో నిరూపించుకుంటోంది ప్రియాంక.
కొన్నేళ్లుగా బాలీవుడ్‌ను వదిలేసి.. హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్నేషనల్ ఈవెంట్‌ల తో గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. త్వరలోనే ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీకి ఆమె ఏకంగా రూ. 40 కోట్ల పారితోషికం అందుకోబోందని టాక్. నిజానికి ఈ మూవీ కోసం ప్రియాంక సుమారు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని.. సుదీర్ఘ చర్చల తర్వాత రూ.40 కోట్లకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.దీంతో.. ఇప్పుడు భారతీయ సినిమాల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కథనాయికగా ప్రియాంక రికార్డ్ సృష్టించింది. అటు..మహేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రియాంకకు ఇంతమొత్తంలో చెల్లించేందుకు నిర్మాతలు సిద్దమయినట్టు సమాచారం. ఇప్పుడు హాలీవుడ్ లోనూ పాపులర్ అయిన ప్రియాంకను ఈ మూవీలో తీసుకోవటం ద్వారా మహేష్ సినిమాకూ ప్రపంచ స్థాయిలో హైప్ వస్తుందని.. మేకర్స్ భావించే ఇంత పెద్ద మొత్తానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
రోజుకు 360 సార్లు వాంతులు.. ఎందుకో తెలిస్తే షాక్! వీడియో
కోతుల బీభత్సం.. స్కూలుకు వెళ్తున్న విద్యార్ధినిపై వీడియో
‘వామ్మో.. వాడు పెద్ద సైకో’వీడియో

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
