మా హీరోను అన్నావ్ సరే.. మరి నీకేం తెలుసు బోడి

Updated on: May 01, 2025 | 3:34 PM

ప్రకాశ్‌ రాజ్! ఫిల్మ్ ఫెటర్నిటీలో విలక్షణ నటుడిగా.. పేరు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు రూటు మార్చారు. సినిమాలు తగ్గించేసి.. రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన స్టాండ్‌ను అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ విమర్శలపాలు కూడ అవుతుంటారు.

ఇప్పుడు కూడా అలాగే పవన్‌ గురించి.. సెటైరికల్‌గా మాట్లాడి ఆయన ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాడు. ఫలింతంగా నెట్టింట ట్రోల్‌ అవుతున్నాడు. ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ప్రకాశ్‌ రాజ్‌.. అటు కోలీవుడ్‌లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్‌ గురించి.. ఇటు ఏపీలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పవన్‌ గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే పవన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మహానాయకులు.. సంఘసంస్కర్తలు, సిద్దాంత కర్తల పేర్లు తెలిసినంత మాత్రాన.. వాళ్లు, వాళ్ల భావాలు తెలిసినట్టు కాదంటూ.. పవన్‌కు ఏపీ తెలియదన్నట్టు మాట్లాడారు. అయితే ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌కు, జనం సైనికులకు కోపం తెప్పించాయి. దీంతో వారందనూ నెట్టింట ప్రకాశ్‌ రాజ్ కామెంట్స్‌ను తిప్పికొడుతున్నారు. ‘మా అన్నకు తెలీదు సరే.. నీకేం తెలుసు బోడి’ అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన తీరును.. తప్పుబడుతున్నారు. అక్రాస్ సోసల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. మ్యాజిక్ లాగా పనిచేస్తుంది!

అలర్ట్‌.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్‌ చేస్తే.. అంతే..

గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు

అనంత్ అంబానీ బరువుకు కారణమేంటి..? కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్నా ఎందుకు తగ్గడం లేదు

విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించిన సీన్‌ చూసి