డార్లింగ్‌ ఇష్టపడుతుంటే.. యంగ్‌ టైగర్‌ వద్దనుకుంటున్నారా

Edited By:

Updated on: Nov 04, 2025 | 10:23 PM

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రూట్‌ని ఫాలో కావాలని చాలా మంది కోరుకుంటారు. కానీ, తారక్‌ అండ్‌ చెర్రీ మాత్రం ఆ రూటు మాకొద్దు బాబోయ్‌ అంటున్నారు. అంతేగాదు.. వాళ్లకంటూ స్పెషల్‌ వే క్రియేట్‌ చేసుకుంటున్నారు. ఇంతకీ డార్లింగ్‌ రూటేంటి? అది వద్దంటున్న ట్రిపుల్‌ హీరోల మాటేంటి? ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు కంప్లీట్‌ కాగానే సీక్వెల్స్ చేయాలి ప్రభాస్‌.

కల్కికి, సలార్‌కీ కొనసాగింపులున్నాయి. అంతే కాదు, ఇప్పుడు సెట్స్ మీదున్న ఫౌజీ, స్పిరిట్‌ విషయంలోనూ రెండో పార్టుల డిస్కషన్‌ వినిపిస్తూనే ఉంది. అయితే ప్రభాస్‌ రూట్‌ని ఫాలో కావడానికి అసలు ఇష్టపడటం లేదు తారక్‌ అండ్‌ చెర్రీ. ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ డైరక్షన్‌లో నటిస్తున్నారు తారక్‌. ఈ మూవీ రెండు పార్టులుగా రిలీజ్‌ అవుతుందనే టాక్‌ వైరల్‌ అయింది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదన్నది యూనిట్‌ నుంచి స్పష్టంగా వినిపిస్తున్న మాట. ఆల్రెడీ దేవరకు సీక్వెల్‌ చేయాలి తారక్‌. దేవర పార్ట్ 2 పూర్తయ్యాక ఇంకే సినిమాకూ కొనసాగింపులు వద్దనుకుంటున్నారట యంగ్‌ టైగర్‌. సేమ్‌ రూట్లోనే ట్రావెల్‌ చేస్తున్నారు చరణ్‌. ప్రస్తుతం పెద్ది సినిమా సెట్లో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్‌. ఈ మూవీ పూర్తయ్యాక సుకుమార్‌ డైరక్షన్‌లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. రంగస్థలం సినిమాకు సీక్వెల్‌ అనే టాక్‌ ఉన్నప్పటికీ, ఫ్రెష్‌ కాన్సెప్ట్ అనే ప్రచారం కూడా గట్టిగానే ఉంది. సినిమా స్టార్ట్ చేశామా? ఎండ్‌ చేశామా? అన్నట్టే ఉండాలన్నది ట్రిపుల్‌ ఆర్‌ హీరోలు నమ్ముతున్న విషయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి.. తల్లినే చంపింది

డిన్నర్‌ డేట్‌కి ముగ్గురు బిలియనీర్లు .. ఫొటోలు వైరల్‌

రైల్వే టికెట్‌ బుకింగ్‌ విధానంలో మార్పులు

బ్లడ్‌ ఇవ్వండి.. ఓ కప్పు టీ తాగండి

వృద్ధ దంపతుల సాహసం.. ఐదేళ్లు శ్రమించి

Published on: Nov 04, 2025 10:17 PM