Kalki 2898 AD: ఇది కార్‌ కాదు.. బుజ్జి డైనోసార్‌ !! ప్రత్యేకలు తెలిస్తే షాకే!

|

May 27, 2024 | 8:50 PM

ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ కార్ డిజైన్‌ చేయించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్... ఆ కార్ కోసం బానే కష్టపడ్డారు. ఇంజనీరింగ్ పుస్తకాలు చదివి మరీ.. కొన్ని వేళ మంది ఇంజనీర్లని కో ఆర్డినేట్ చేస్తూ.. ప్రభాస్‌ బుజ్జికి రూపం ఇచ్చాడు. అందుకోసం ఏకంగా దేశ విదేశాల నుంచి పరికరాలను ఇంపోర్ట్ చేసుకున్నాడు. కారును వాస్తవ రూపంలో తీసుకురావడానికి ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థలైన మహీంద్రా, కోయం బత్తూరులోని జయం మోటార్స్‌ ఇంజినీర్లు సహకారం అందించారు.

ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ కార్ డిజైన్‌ చేయించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్… ఆ కార్ కోసం బానే కష్టపడ్డారు. ఇంజనీరింగ్ పుస్తకాలు చదివి మరీ.. కొన్ని వేళ మంది ఇంజనీర్లని కో ఆర్డినేట్ చేస్తూ.. ప్రభాస్‌ బుజ్జికి రూపం ఇచ్చాడు. అందుకోసం ఏకంగా దేశ విదేశాల నుంచి పరికరాలను ఇంపోర్ట్ చేసుకున్నాడు. కారును వాస్తవ రూపంలో తీసుకురావడానికి ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థలైన మహీంద్రా, కోయం బత్తూరులోని జయం మోటార్స్‌ ఇంజినీర్లు సహకారం అందించారు. కారుకు 34.5 అంగుళాల సైజు కలిగిన రిమ్స్‌ను అమర్చగా, ప్రత్యేకంగా సియట్‌ వాళ్లు టైర్లను డిజైన్‌ చేసి ఇచ్చారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మెటీరియల్‌తో అల్యూమినియం అలాయ్‌ వీల్స్‌ను తయారు చేశారు. రియర్‌ వీల్‌ సస్పెన్షన్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్ప్రింగ్‌లను అమర్చి ఎటు కావాలంటే అటు తిరిగేలా చక్రాలను డిజైన్‌ చేశారు. కారు టైరుకు టేపరోలింగ్‌ బేరింగ్స్‌, హాలో హబ్స్‌ను జత చేశారు. కారు మొత్తం పొడవు 6075 MM, వెడల్పు 3380 MM, ఎత్తు 2186 MM. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 180 MM! ఇలా కార్లా కాకుండా ప్రభాస్‌కి బుజ్జి డైనోసార్లా ఈ కార్‌ను తయారు చేయించారు నాగ్ అశ్విన్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో !! పిరమిడ్స్ నిర్మాణం వెనుక ఇంత టెక్నాలజీ ఉందా ??

అమెరికాలో విజయవాడకు చెందిన తొలి తెలుగు జడ్జి

ఆ 3 దేశాల దృష్టిలో పాలస్తీనా ఇక స్వతంత్ర దేశం

PM Modi Biopic: మోదీ బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన నటుడు సత్యరాజ్‌

Trump Biopic: ట్రంప్‌ బయోపిక్‌లో మొదటి భార్యపై లైంగికదాడి సీన్‌

Follow us on