Prabhas Marriage: తిరుపతిలోనే ప్రభాస్ పెళ్లి.. ఇట్స్ ఫిక్స్..! డార్లింగ్ క్లారిటీ ఇచ్చేసాడు..

|

Jun 07, 2023 | 9:02 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మ్యారేజ్‌పై గుడ్‌ న్యూస్‌ చెప్పారు హీరో ప్రభాస్. తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానంటూ అభిమానుల కేరింతల మధ్య ప్రకటించారు. ఇక్కడే మ్యారేజ్ చేసుకుంటానన్న ప్రభాస్‌.. ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. తారకరామ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద తరలివచ్చారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మ్యారేజ్‌పై గుడ్‌ న్యూస్‌ చెప్పారు హీరో ప్రభాస్. తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానంటూ అభిమానుల కేరింతల మధ్య ప్రకటించారు. ఇక్కడే మ్యారేజ్ చేసుకుంటానన్న ప్రభాస్‌.. ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. తారకరామ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద తరలివచ్చారు. అభిమాననాయకుడి కోసం అశేష అభిమానలోకం తరలిరావడంతో తిరుపతి గ్రౌండ్‌ కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణ జరిగే చోట.. జై శ్రీరామ్‌, జై సియారామ్‌ నినాదాలూ హోరెత్తాయి. ఫస్ట్ ట్రైలర్ ఫ్యాన్స్ కోసమే అంటూ త్రీడీలో తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్‌ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోనే చేసుకుంటానని పెళ్లి ఎప్పుడని అడిగిన అభిమానులతో అన్నారు. ఇక ఆదిపురుష్ సినిమా చేయడం గొప్ప అదృష్టమని చిరంజీవి చెప్పారన్నారు ప్రభాస్. 20 ఏళ్లలో ఆదిపురుష్ టీం చాలా కష్టపడటం చూశానన్న హీరో.. ఏడాదికి 2 లేదంటే 3 సినిమాలు చేస్తానన్నారు. స్టేజీ పై తక్కువ మాట్లాడి, ఎక్కువ సినిమాలు చేస్తానంటూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. అలాగే జానకి పాత్రలో కృతి సనన్ ఎంతో బాగా నటించిందన్నారు ప్రభాస్. ఫస్ట్ ట్రైలర్ ఫ్యాన్స్ కోసమే అంటూ త్రీడీలో తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.