Ustaad Bhagat Singh: ఉస్తాద్‌పై కామెంట్స్..కంగారు పడుతున్న ఫ్యాన్స్
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మేకర్స్ పని గట్టుకుని హైప్ పెంచుతున్నారు. 'ఓజీ' తర్వాత పవన్ వింటేజ్ పవర్ స్టార్‌ను మళ్ళీ చూపించే సినిమా ఇది. రికార్డులు తిరగరాస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌లో మొదటి సింగిల్, 2026 సమ్మర్‌లో సినిమా విడుదల కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది.
పవన్ కళ్యాణ్ సినిమాలపై ప్రత్యేకంగా పని గట్టుకుని హైప్ పెంచాల్సిన అవసరం లేదు.. పవర్ స్టార్ అనే పేరే చాలు బొమ్మ రేంజ్ మారిపోవడానికి..! అలాంటిదిప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్‌పై పని గట్టుకుని కాదు.. ఏకంగా టైమ్ దొరికిన ప్రతీసారి అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. తాజాగా నిర్మాత చెప్పిన మాటలతో గాల్లో తేలిపోతున్నారు అభిమానులు. ఇంతకీ ఆయనేం చెప్పారు..? తన నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు అనేది ఓజి సినిమాతో పవన్ కళ్యాణ్‌కు కూడా అర్థమైంది. అందుకే నెక్ట్స్ రాబోయే సినిమాల్లోనూ అవే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్. పొలిటికల్ ఇమేజ్ కాసేపు పక్కనబెట్టి.. తనలోని వింటేజ్ పవన్‌ను బయటికి తెస్తున్నారీయన. ఓజితో ఫ్యాన్స్‌కే ఫుల్ మీల్స్ పెట్టిన పవర్ స్టార్.. ఉస్తాద్‌తో అందరికీ విందు భోజనమే ప్లాన్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది.. ఇందులో పవన్ పోర్షన్ ఫినిష్ చేసి చాలా కాలమైంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు డబుల్ అయ్యాయి. డిసెంబర్‌లో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.. అలాగే సినిమా 2026 సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పవన్ సినిమా అంటేనే హైప్ కామన్.. అది చాలదన్నట్లు మేకర్స్ పని గట్టుకుని అంచనాలు పెంచేస్తున్నారు. ఇది పవన్ ఫ్యాన్స్ లైబ్రరీలో దాచుకునే సినిమా అవుతుందంటూ హరీష్ శంకర్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు నిర్మాత రవిశంకర్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వింటున్నారుగా రవి శంకర్ ఏమంటున్నారో..? ఉస్తాద్ విడుదలైన తర్వాత ఏ రికార్డ్ కూడా వదలకుండా అన్నీ పవన్ పేరు మీదే ఉంటాయని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. డిసెంబర్ నుంచే ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి ఓజి మత్తు వదిలేలా ఉస్తాద్ మాయ చేస్తారా లేదా చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahavatar Narasimha: ఆస్కార్ బరిలో మహావతార్ నరసింహ
Keerthy Suresh: తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టిన కీర్తీ సురేష్
TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!