Naga Chaitanya: నాగ చైతన్య మాస్టర్ ప్లాన్.. వర్కవుట్ అయితే సుడి తిరిగినట్లే
నాగ చైతన్య తన కెరీర్‌లో మీడియం రేంజ్ నుండి బయటపడి, 'తండేల్' విజయంతో (100 కోట్లు) బిగ్ లీగ్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో, అత్యధిక బడ్జెట్‌తో వస్తున్న 'వృషభ కర్మ' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదగాలని చూస్తున్నారు. ట్రెజర్ హంట్, పీరియాడిక్ టచ్ ఉన్న ఈ సినిమాతో చైతూ స్టార్‌డమ్ సాధిస్తారో చూడాలి.
నాగ చైతన్య కెరీర్ ఇప్పటి వరకు మీడియం రేంజ్‌లోనే ఉంది.. ఎన్నిసార్లు ట్రై చేసినా ప్రమోషన్ మాత్రం రాలేదు. ఫస్ట్ టైమ్ తండేల్‌తో తను కూడా బిగ్ లీగ్‌లోకి వెళ్ళగలను.. ఆ సత్తా నాక్కూడా ఉందని చూపించారు చైతూ. అదే జోరు కంటిన్యూ చేస్తూ ఇప్పుడేకంగా ప్యాన్ ఇండియాను షేక్ చేసే పనిలో బిజీ అయ్యారు. దానికోసం మాస్టర్ ప్లాన్ వేసారు.. ఇంతకీ ఏంటది..? 16 ఏళ్ళ కింద జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగ చైతన్య.. ఇప్పటి వరకు 23 సినిమాలు చేసారు. ఇన్నేళ్ళలో ఎన్నో విజయాలు అందుకున్నారు.. ఫ్లాపులు కూడా ఇచ్చారు. కానీ ఈయన మాత్రం ఇంకా మిడ్ రేంజ్‌లో మిగిలిపోయారు. స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ కోసం చాలా ఏళ్లుగా కష్టపడుతున్నారు చైతూ.. ఇప్పుడా అవకాశం వచ్చింది ఈయనకు. మధ్య మధ్యలో మాస్ సినిమాలతో తడాఖా చూపించినా.. ఎక్కువగా చైతూకు ఇమేజ్ తెచ్చిపెట్టింది రొమాంటిక్ సినిమాలే. ఇక మొన్నొచ్చిన తండేల్ సినిమాతో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ 100 కోట్ల మార్క్ అందుకున్నారు చైతూ. ఈ సినిమా కూడా లవ్ స్టోరీనే అయినా.. ఇందులో యాక్షన్ డోస్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ మార్కెట్ కంటిన్యూ చేస్తూ.. కార్తిక్ దండు సినిమాతో వస్తున్నారు అక్కినేని వారసుడు. కార్తిక్ సినిమాకు వృష కర్మ టైటిల్ లాక్ చేసారు.. అంటే నీతిమంతుడు అని అర్థం. ట్రెజర్ హంట్‌కు సంబంధించిన ఈ కథలో పిరియాడిక్ టచ్ కూడా ఉంటుంది. విరూపాక్షలా దీనిక్కూడా సంస్కృతం టైటిల్ పెట్టారు కార్తిక్. చైతూ కెరీర్‌లోనే హైయ్యస్ట్ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో చైతూ బిగ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahavatar Narasimha: ఆస్కార్ బరిలో మహావతార్ నరసింహ
Keerthy Suresh: తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టిన కీర్తీ సురేష్
TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

