స్పీడు మీదున్న హీరోలు.. బ్రేకులేస్తున్న దర్శకులు

Edited By:

Updated on: Nov 24, 2025 | 8:33 PM

పాన్ ఇండియా చిత్రాల ఆలస్యానికి దర్శకులే ప్రధాన కారణమని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. హీరోలు త్వరితగతిన సినిమాలు పూర్తి చేయాలని ఉన్నా, దర్శకుల ప్రణాళిక లోపం, స్క్రిప్ట్ సిద్ధం చేయకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో జాప్యం వల్ల ప్రాజెక్ట్‌లు ఆలస్యం అవుతున్నాయి. హీరోల డేట్స్‌ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో విఫలమవడం, గ్రాఫిక్స్‌కు పట్టే సమయాన్ని అంచనా వేయకపోవడమే ప్రధాన సమస్యగా నిలుస్తోంది.

పాన్ ఇండియా ట్రెండ్‌లో దర్శకుల మీద చాలా కంప్లయింట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరోలను ఒకే ప్రాజెక్ట్ మీద రెండు మూడేళ్లు లాక్ చేయటం విషయంలో ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా హర్ట్ అవుతున్నారు. హీరోలు ఏడాది రెండు సినిమాలు చేయాలనుకుంటున్నా… దర్శకుల కారణంగానే ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయన్నది మేజర్‌గా వినిపిస్తున్న కంప్లయింట్‌. నిజంగానే ఆలస్యానికి కారణం దర్శకులేనా? పాన్ ఇండియా హీరోల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావటం కాదు, రెండేళ్లకు ఒక్క సినిమా రావటం కూడా కష్టంగా మారింది. ప్రీ ప్రొడక్షన్‌, మేకోవర్‌, ఆ తరువాత గ్రాఫిక్స్‌, పోస్ట్ ప్రోడక్షన్ ఇలా ప్రతీ విషయంలోనూ డిలే కనిపిస్తోంది. అందుకే ప్రతీ హీరో ఒక్కో ప్రాజెక్ట్ మీద రెండు మూడేళ్లు వర్క్ చేయాల్సి వస్తోంది. సినిమా ఆలస్యం అవ్వటంలో మేజర్‌గా దర్శకులదే బాద్యత అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. స్టార్ హీరో ఒక సినిమా పూర్తి చేసిన తరువాత మరోసారి సినిమా స్టార్ట్ చేయడానికి చాలా టైమ్ తీసుకుంటున్నారు. నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయాల్సిన దర్శకులు ఫుల్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉండకపోవటం వల్లే కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కటం ఆలస్యమవుతోంది. ఒకరిద్దరు హీరోలు జాగ్రత్తగానే ప్లాన్ చేసుకుంటున్న ఇతర కారణాలు ఇబ్బంది పెడుతున్నాయి. దేవర రిలీజ్‌కు ముందే వార్‌ 2ను ప్రారంభించారు తారక్‌. గేమ్ చేంజర్ రిలీజ్‌ కన్నా ముందే పెద్ది వర్క్ స్టార్ట్ చేశారు చరణ్. ఇక ప్రభాస్ అయితే ఒకేసారి మూడు నాలుగు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. హీరోలు స్పీడు చూపిస్తున్నా… పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ విషయంలో దర్శకులకు సరైన ప్లానింగ్ లేని కారణంగా సినిమాలు ఆలస్యమవుతున్నాయి. హీరోల డేట్స్‌ సరిగా వాడుకోకపోవటం, గ్రాఫిక్స్‌కు ఎంత టైమ్ పడుతుందో అంచనా వేయలేకపోవటంతో అనుకున్న టైమ్‌కు సినిమాలు రిలీజ్ కావటం లేదు. మరి ఈ అనుభవాల తరువాతైనా దర్శకులు రూటు మారుస్తారేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ

సమ్మర్‌లో మెగా కార్నివాల్.. చికిరి చికిరితో స్టార్ట్

ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??

నా దారి అడ్డదారి అంటూ వెళ్లబోయిన శునకం.. చివరికి

స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్

Published on: Nov 24, 2025 08:22 PM