సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్ సినిమా పై ఆసక్తి పెంచాయి. కాగా ఈ భారీ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలకానుంది.
ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఇక, ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తారక్ క్షమాపణలు కోరుతూ ఎక్స్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఈవెంట్ సజావుగా జరిగి,గ్రాండ్ సక్సెస్ కావడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడం మరిచిపోయినందుకు సారీ చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్‌టీఆర్ మాట్లాడుతూ.. “ఇందాక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయాను. నన్ను క్షమించాలి. ఈవెంట్ సజావుగా జరిగేందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, పోలీస్ డిపార్ట్‌మెంట్ అందించిన మద్ధతుకు పాదాభివందనాలు. ఎంతో బాధ్యతతో అభిమానుల ఆనందానికి కారణమయ్యారు” అని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం :