AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'హరి హర వీరమల్లు' సినిమా స్థాయిని ఎవరూ తగ్గించలేరు!

‘హరి హర వీరమల్లు’ సినిమా స్థాయిని ఎవరూ తగ్గించలేరు!

Samatha J
|

Updated on: Jun 07, 2025 | 3:32 PM

Share

"చెప్పేవాడికి వినేవాడు లోకువ" అని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి బయ్యర్లు దొరకట్లేదని వార్తలు రావడమేంటి? దానిని నిజమని కొందరు నమ్మడమేంటి? అంతకంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా?తెలుగునాట పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. ఆయన సినిమా విడుదల అంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణమే. అలాంటిది పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'కి బయ్యర్లు దొరకట్లేదని కొన్ని న్యూసులు వస్తున్నాయి. అయితే ఈ న్యూసులే నమ్మశక్యంగా లేదనేది పవన్‌ ఫ్యాన్స్ తో పాటు కొంత మంది మేకర్స్ మాట. పవన్ కళ్యాణ్ మొదటిసారి నటించిన పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు'. పైగా ఆయన చారిత్రక యోధుడిగా నటించిన తొలి చిత్రం. మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపిస్తున్నారు.

అద్భుతమైన సెట్లు, గ్రాఫిక్స్ తో ఎక్కడా రాజీ పడకుండా మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. 2020 ద్వితీయార్థంలో మొదలై, 2022 జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. వీరమల్లు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో అనే మూడు సినిమాలు వచ్చాయంటే.. ఈ చిత్రం ఎంత ఆలస్యమైందో అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం ఈ చిత్రానిది. అసలే భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్. దానికి తోడు షూటింగ్ ఆలస్యమైంది. దాంతో సహజంగానే బడ్జెట్ పెరిగిపోయింది.మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలుగునాట భారీ బిజినెస్ చేస్తుంటాయి. అలాంటిది ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రమిది. మరి ఈ సినిమా, ఏ స్థాయి బిజినెస్ చేయాలి. దానిని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు గత చిత్రాలకు మించి అధిక ధరలు చెప్తున్నారు. పలువురు బయ్యర్లు ఈ భారీ సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ.. నిర్మాతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే ఇది ప్రతి సినిమాకి జరిగే వ్యవహారమే. ఈ క్రమంలోనే హరి హర వీరమల్లుకి బయ్యర్లు దొరకడం లేదనే న్యూస్ వైరల్ అయింది. ఇప్పుడు అది తప్పది.. అలాంటిదేం లేదనే న్యూస్ ఫిల్మ్ సిటీలో వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

సుడిగాలి సుధీర్ కాదు.. ఇక నుంచి సర్కార్ సుధీర్.. వీడియో

నిర్మాత బాగు కోసం.. రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేసిన పవన్‌

గంగవ్వకు ఇన్ని కష్టాలా? పాపం గంగవ్వ! కష్టాలు చెబుతూ బోరున ఏడుపు!