Nikhil Siddhartha: హీరో నిఖిల్ ఎమోషనల్‌.! ‘నాన్నే మళ్లీ పుట్టాడనుకుంటా’ వీడియో షేర్.

Updated on: Feb 23, 2024 | 11:11 AM

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అతని భార్య పల్లవి ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్‌. కుమారుడిని ఎత్తుకున్న ఫొటోను ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకున్నాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిఖిల్‌ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అతని భార్య పల్లవి ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్‌. కుమారుడిని ఎత్తుకున్న ఫొటోను ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకున్నాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిఖిల్‌ దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఇక కొడుకు పుట్టిన సందర్భంలో కాస్త ఎమోషనల్ అయ్యాడు నిఖిల్‌. కొన్ని రోజుల క్రితమే కన్నుమూసిన తన తండ్రి మళ్లీ తిరిగి వచ్చాడంటూ పోస్ట్‌ చేశాడు. “ఏడాది క్రితమే మా నాన్న కన్నుమూశారు. ఇప్పుడు మా ఫ్యామిలీలోకి మగ బిడ్డ అడుగుపెట్టాడు. నాన్నే మళ్లీ తిరిగి వచ్చాడని అనుకుంటున్నాను. అమ్మానాన్నాలైనందుఉ ఎంతో సంతోషంగా ఉంది” అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు నిఖిల్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. 2020లో నిఖిల్‌- పల్లవిలు పెళ్లిపీటలెక్కారు. పెళ్లికి ముందు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నారు. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఇప్పుడు పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్‌. కొన్ని రోజుల క్రితమే తన భార్య సీమంతం వేడుకలను గ్రాండ్‌ గా నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..