Naveen Polisetty: ప్రమోషన్ తో కుమ్మేస్తున్న నవీన్ పోలిశెట్టి..
నువ్ తోపు గురూ.. ఓ హీరో ప్రమోషన్స్ చూసాక ఆడియన్స్ ఆయన్ని చూసి అంటున్న మాట ఇదే. మేం ప్రమోషన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. 200 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ లెక్కలు చెప్తున్న ఈ రోజుల్లో.. నిర్మాతకు పైసా ఖర్చు లేకుండా అదిరిపోయే ప్రమోషన్ చేస్తున్నాడు ఓ హీరో. ప్రతీ అకేషన్ వాడేస్తూ ఆయన సినిమాను ట్రెండ్ చేస్తున్నాడు.
ఇంతకీ ఎవరా హీరో..? చూస్తున్నారుగా.. మొన్న దసరాకు ఓ వీడియో చేసిన నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు దివాళికి మరో వీడియోతో వచ్చేసారు. సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్ పరంగా అందరికంటే రెండు అడగులు ముందే ఉంది అనగనగా ఒకరాజు. పైగా ఈ ప్రమోషన్స్ దగ్గరుండి చేసుకుంటున్నారు నవీన్ పొలిశెట్టి. నిర్మాతకు పైసా ఖర్చు లేకుండా తన మార్క్ ప్రమోషన్స్‌తో సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడుతున్నారు ఈ హీరో.ఆ మధ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం ఎలాగైతే అనిల్ రావిపూడి తన మార్క్ ప్రమోషన్స్ చేసి సంక్రాంతికి తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారో.. ఇప్పుడు నవీన్ కూడా ఇదే చేస్తున్నారు. విడుదలకు మూన్నెళ్ల ముందే టీజర్ విడుదల చేసారు.. తాజాగా దివాళి వీడియోలో సోలో పర్ఫార్మెన్స్‌తో రప్ఫాడించారు నవీన్. ఈ ప్రమోషనల్ వీడియో వైరల్ అవుతుంది. జాతి రత్నాలు తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో నటించారు నవీన్. కాకపోతే అనుష్క కారణంగా ఈయనకు కోరుకున్న గుర్తింపు రాలేదు. దాంతో అనగనగా ఒకరాజుపై ఫోకస్ చేసారు ఈ హీరో. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మారి దర్శకుడు. జనవరి 14న రానుంది ఈ చిత్రం. మరి ఈ ప్రమోషన్స్ సినిమాకు ఎంత వరకు హెల్ప్ అవుతాయో చూడాలి. ఈ సంక్రాంతికి కేవలం నవీన్ మాత్రమే కాదు.. మరో అరడజన్ సినిమాలు వస్తున్నాయి. అందులో చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారూ, శర్వానంద్ నారినారి నడుమ మురారి, రవితేజ సినిమాలు కూడా ఎంటర్‌టైనర్సే. ఈ మూడు సినిమాలతో పాటు రాజా సాబ్ హార్రర్ కామెడీగా రానుంది. అందుకే నవీన్ తన ప్రమోషనల్ స్ట్రాటజీ వాడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bahubali: బాహుబలి ఎపిక్.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. మరల బాక్సాఫీస్ బద్దలే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

