Allu Arjun: అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లి కోర్టు అనుమతి

|

Jan 12, 2025 | 2:30 PM

పుష్ప-2 రికార్డ్‌ కలెక్షన్స్‌తో ఖుషీగా ఉన్న అల్లు అర్జున్‌కు..మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది నాంపల్లి కోర్టు. ఇకపై విచారణకు ప్రతివారం చిక్కడపల్లి స్టేషన్‌కు వెళ్లనవసరం లేదని తెలిపింది. దీంతో షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్లేందుకు బన్నీకి లైన్‌ క్లియరయింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌కు ఊరట కల్పించింది..నాంపల్లి కోర్టు.

పలు షరతులతో అల్లు అర్జున్‌కు ఇప్పటికే రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. తాజాగా వాటికి సడలింపు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేసే వరకు అల్లు అర్జున్‌ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని..బెయిల్‌లో షరతులు విధించింది కోర్టు. తాజాగా ఆ షరతు నుండి మినహాయింపు ఇచ్చింది న్యాయస్థానం. అల్లు అర్జున్‌ గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు.. ఆయన్ను చూసేందుకు ఫ్యాన్స్‌ భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రతి ఆదివారం చిక్కడపల్లి స్టేషన్‌కు వెళ్లడం వల్ల సెక్యూరిటీ పరంగా పలు ఇబ్బందులు వస్తున్నాయని కోర్టులో పిటిషన్‌ పెట్టుకున్నారు..అల్లు అర్జున్‌. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బన్నీకి ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదంటూ కోర్టు ఆదేశించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్‌లు..

ముళ్ల పందులు, చిరుత ఎలా కొట్లాడుకున్నాయో చూడండి

డాకు మహారాజ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే

‘వదిన’ను పెళ్లి చేసుకున్న సాయికిరణ్ ఫోటోలు వైరల్

రూ.100 కోట్లతో కొత్త ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్