శోభితపై దారుణ విమర్శలు! బాధపడిన నాగ చైతన్య..
సమంతతో విడిపోయాక... ట్రోల్స్ తో.. నెగటివ్ న్యూస్‌తో విపరీతంగా సతమతమయ్యాడు నాగ చైతన్య. ఇక మరో పక్క సమంత పరిస్థితి కూడా ఇంతే! అయినా కానీ.. తమ మీద వస్తున్న నెగెటివ్ వార్తలను ఏ మాత్రం లెక్క చేయని వీరిద్దరూ తమ పని తాము చేసుకున్నారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభితతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని పెళ్లి చేసుకున్నాడు.
దీంతో ట్రోలర్స్ అందరూ శోభితను టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఇదే విషయం పై తాజాగా రియాక్టయ్యాడు నాగ చైతన్య. తండేల్ మూవీ సక్సెస్‌తో జోరు మీదున్న చైతన్య… తాజాగా ఓ పాడ్ కాస్ట్ షోకు వెళ్లాడు. ఈ షోలో.. తన లైఫ్‌లో జరిగిన జరుగుతున్న చాలా విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే శోభితతో తన రిలేషన్ ఎలా మొదలైందో చెప్పిన చై… తన కారణంగా శోభిత విమర్శల పాలైందంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. తనకు శోభతకు గతంతో ఎలాంటి సంబంధం లేదని.. అయినప్పటికీ తమకు సంబంధం అంటగట్టి దారుణంగా విమర్శించారని చెప్పాడు. అలా శోభితకు సంబంధం లేని విషయంలో ఆమెను ట్రోల్ చేయడం తనకు నచ్చలేదని.. ఆ సమయంలో తనకు చాలా బాధగా అనిపించిందని చెప్పాడు నాగ చైతన్య.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇన్‌స్టా పరిచయం ప్రేమగా.. చివరికి పెళ్లిగా మారింది!
ఈ బ్యూటీ సంపాదన తెలిస్తే మన హీరోయిన్స్ బోరున ఏడ్చేయరూ
సినీ ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. చిరంజీవి స్పెషల్ థాంక్స్
అది నా ప్రైవేట్ వీడియో కాదు.. ఎట్టకేలకు నోరువిప్పి నిజం చెప్పిన హీరో నిఖిల్