అది నా ప్రైవేట్ వీడియో కాదు.. ఎట్టకేలకు నోరువిప్పి నిజం చెప్పిన హీరో నిఖిల్
మస్తాన్ సాయి.. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలోనూ ఇతని గురించే చర్చ నడుస్తోంది. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య.. మస్తాన్ సాయి మీద కేసు పెట్టంది. అదే సందర్భంలో అతనికి సంబంధించిన ఒక హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అందజేసింది.
ఈ హార్డ్ డిస్క్ లో దాదాపుగా 200 వరకు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, న్యూడ్ వీడియోలు, ఆడియో కాల్స్ ఉన్నట్లుగా పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయని తెలిపింది. దీంతో ఈ విషయంపై గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. నిఖిల్ ఫ్యాన్స్ నుంచి కూడా వ్యతిరేకత మొదలైంది. దీంతో తాజాగా ఈ విషయంపై హీరో నిఖిల్ రియాక్టయ్యాడు. తనపై జరుగుతున్నది అసత్య ప్రచారమంటూ ఖండించాడు. అసలు ఆ వీడియోలో ఏమున్నదనే దానిపై వివరణ ఇచ్చాడు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ తర్వాత డిన్నర్ పార్టీ జరిగిందని… ఆ వీడియోలనే ఇప్పుడు తప్పుగా చూపిస్తున్నారన్నాడు హీరో నిఖిల్. అందులో కూడా ఉన్నది తన కుటుంబ సభ్యులే అని.. పోలీసులకు కూడా వాస్తవం ఏంటనేది తెలుసంటూ.. నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. తమ హీరో ఇచ్చిన వివరణతో నిఖిల్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తమ హీరో ఇన్నోసెంట్ అని.. నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు.. మస్తాన్ సాయిని.. లావణ్య వివాదానికి త్వరగా చెక్ పెట్టాలని పోలీసులకు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

