సినీ ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. చిరంజీవి స్పెషల్ థాంక్స్
ఈ ఏడాది చివరలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, ఆమిర్‌ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమమాలిని, దీపిక పదుకొణే, ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు.
ఇక తనను ఈ సమావేశంలో భాగం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చిరు ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ‘‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మోదీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు’’ త్వరలోనే అన్ని ఉత్సాహాలకు, కొత్త పునాదులకు సిద్ధంగా ఉండండి” అంటూ చిరు ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది నా ప్రైవేట్ వీడియో కాదు.. ఎట్టకేలకు నోరువిప్పి నిజం చెప్పిన హీరో నిఖిల్
వైరల్ వీడియోలు

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
