Movie Tickets: మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99లకే మల్టీప్లెక్స్ సినిమా టికెట్..!
2023లో పలు సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. రికార్డు స్థాయి కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రిలీజయ్యాయి. అలాగే విజయ్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సన్నీడియోల్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టోవినో థామస్ తదితర ఇతర భాషల హీరోల సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి.
2023లో పలు సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. రికార్డు స్థాయి కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రిలీజయ్యాయి. అలాగే విజయ్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సన్నీడియోల్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టోవినో థామస్ తదితర ఇతర భాషల హీరోల సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. వందల కోట్ల రూపాయలకూ పైగా బిజినెస్ చేశాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజైనప్పుడు అన్నీ థియేటర్లకు వెళ్లి చూడడమనేది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మల్టీప్లెక్స్‌లో సినిమా టికెట్ల ధరలు ఇప్పుడు బాగా పెరిగాయి. దీంతో చాలామంది ఓటీటీల్లోనే సినిమాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా లవర్స్‌కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఒక బంపపరాఫర్ ఇచ్చింది. నేషనల్ సినిమా డేను పురస్కరించుకుని 99రూపాయలలకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవకాశాన్ని కల్పించనుంది.
భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పలు ప్రణాళిక రూపొందించారు. అందులో నేషనల్ సినిమా డే వేడుక కూడా ఒకటి. ఈరోజున దేశవ్యాప్తంగా పలు మల్టీప్లెక్స్‌లతో పాటు ఎంపిక చేసిన థియేటర్లలో అన్ని సినిమాల టిక్కెట్‌లను తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. అందుకే ఈ ఏడాది కూడా నేషనల్ సినిమా డే జరుపుకోవాలని మల్టీప్లెక్స్‌లు, థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 13న నేషనల్ సినిమా డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. PVR, Inox, Cinepolis, Mirage, CityPride, Asian, MovieTine వంటి మల్టీప్లెక్స్‌లు ఈ వేడుకల్లో భాగంకానున్నాయి. సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్టోబర్ 13న దేశవ్యాప్తంగా అన్ని సినిమాల టిక్కెట్లు కేవలం 99 రూపాయలకే అందుబాటులో ఉంటాయి. ఆ రోజు స్నాక్స్, డ్రింక్స్ ధరలు కూడా తగ్గనున్నాయి. ఈ ఆఫర్‌తో భారీ సంఖ్యలో ప్రేక్షకులు సినిమా థియేటర్‌కి వస్తారని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..