Mokshagna Teja – Rajinikanth: మైథలాజికల్ కాన్సెప్ట్స్ తో వస్తున్న వారసులు..| ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. రజినికాంతా.. మజాకానా.!
దేవుడి కాన్సెప్ట్ సినిమాలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అందుకే ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేయడం కోసం కూడా ఇలాంటి కథల్నే ఎంచుకుంటున్నారు దర్శకులు. తాజాగా మరో వారసుడు సైతం ఇలాంటి ఓ దేవుడి కథతోనే వస్తున్నాడు. ఈ మధ్యే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మపై పెట్టారు బాలయ్య. ఈయన తొలి సినిమా మైథలాజికల్ టచ్‌తోనే సాగనుంది. తన యూనివర్స్‌లో భాగంగా ఈ కథ రాస్తున్నారు ప్రశాంత్ వర్మ.
దేవుడి కాన్సెప్ట్ సినిమాలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అందుకే ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేయడం కోసం కూడా ఇలాంటి కథల్నే ఎంచుకుంటున్నారు దర్శకులు. తాజాగా మరో వారసుడు సైతం ఇలాంటి ఓ దేవుడి కథతోనే వస్తున్నాడు. ఈ మధ్యే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మపై పెట్టారు బాలయ్య. ఈయన తొలి సినిమా మైథలాజికల్ టచ్‌తోనే సాగనుంది. తన యూనివర్స్‌లో భాగంగా ఈ కథ రాస్తున్నారు ప్రశాంత్ వర్మ. అచ్చం ఇలాగే సాయికుమార్ తమ్ముడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ కూడా తన వారసుడిని దేవుడి నేపథ్యం ఉన్న కథతోనే లాంఛ్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి కాన్సెప్ట్‌తో సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కొందరు హీరోల సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లుంటేనే చాలు ప్రమోషన్ వచ్చేస్తుంది. అలాంటి హీరోనే రజినీకాంత్ కూడా. సూపర్ స్టార్ బొమ్మ కనిపిస్తే చాలు కలెక్షన్లు అవే వచ్చేస్తుంటాయి.. ఇక బాగుంటే రికార్డులే. ప్రస్తుతం ఈయన వేట్టయన్ సినిమాతో అక్టోబర్ 10న రానున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 20న జరగనుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా స్పెషల్ ప్రమోషన్స్ అయితే చేయట్లేదు మేకర్స్. కానీ తాజాగా రజినీ ఈ బాధ్యత తీసుకున్నారు. కూలీ సెట్స్‌లో.. వేట్టయన్ సాంగ్‌కు డాన్స్ వేసారు.. దాంతో దెబ్బకు సినిమా ట్రెండ్ అవుతుందిప్పుడు. లోకేష్ కనకరాజ్ సినిమా లొకేషన్స్‌లో మనసిలాయో అంటూ మాస్ స్టెప్పులు వేసారు రజినీ. అంతే.. ఇటు కూలీతో పాటు.. అటు వేట్టయన్ గురించి మాట్లాడేసుకుంటున్నారు నెటిజన్లు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే కాబోలు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.