మమ్మల్ని అవమానిస్తున్నారు.. మీడియాకెక్కిన చిరు ఫ్యాన్స్

|

Mar 25, 2023 | 9:48 AM

వారంతా మోగాస్టార్‌ చిరంజీవి అభిమానులు... చిరు పేరు మీద ఓ ఫెడరేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా తమకు చిరు చేయి దూరంగానే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారంతా మోగాస్టార్‌ చిరంజీవి అభిమానులు… చిరు పేరు మీద ఓ ఫెడరేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా తమకు చిరు చేయి దూరంగానే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవమానాలు ఎన్ని ఎదురైనా చిరుకు చేరువగా చేరుతామనే చెబుతున్నారు. సేవ్ రియల్ ఫ్యాన్స్… రెస్పెక్ట్ సీనియర్ ఫ్యాన్స్… అనే నినాదంతో చిరంజీవి వైపు కదిలి వస్తున్నారు. ఛలో హైదరాబాద్ అంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి హార్డ్ కోర్‌ అభిమానులు కొంత మంది కలిసి 2016లో అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ను స్థాపించారు. ఆ ఫెడరేషన్ వేదికగా.. చిరుపై ఎప్పుడూ తమ అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నారు. అయితే ఇదే ఫెడరేషన్ సభ్యులే ఇప్పుడు తమకు అవామానాలు జరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలవనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. రీసెంట్ గా జరిగిన చరణ్ ఫోటో షూట్‌కు కూడా తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని బాధపడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్రె.. నాని కంటే.. ఆ కుర్రాడే సూపరట !!

Prabhas: వావ్ హాలీవుడ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ అంటే మాములుగా ఉండదు మరి..

Upasana Konidela: భర్తకు తగ్గ భార్య.. ఉపాసనకు ఇంటర్నేషనల్ అవార్డ్

మనోజ్‌ చేసిన ఆ చిన్నతప్పే.. ఇంత పెద్ద లొల్లికి కారణం !!

Published on: Mar 25, 2023 09:48 AM