Meenakshi Chowdary: సీనియర్ హీరోలతో జోడీకి రెడీ అంటున్న మీనాక్షి
చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన మీనాక్షి చౌదరి తరువాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ లీగ్‌లో ఫ్లాష్ అయ్యారు. సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ భామ.. తరువాత వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. ప్రజెంట్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ భామ, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో తన ప్లానింగ్ ఏంటో రివీల్ చేశారు.
చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన మీనాక్షి చౌదరి తరువాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ లీగ్‌లో ఫ్లాష్ అయ్యారు. సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ భామ.. తరువాత వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. ప్రజెంట్ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ భామ, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో తన ప్లానింగ్ ఏంటో రివీల్ చేశారు. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన మీనాక్షి చౌదరి… తరువాత వరుస ఆఫర్స్‌తో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా టాప్ హీరోలతో జోడి కడుతూ స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, వరుసగా సీనియర్ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్‌కు జోడీగా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభరలో కీ రోల్‌లో నటిస్తున్నారు.సీనియర్ హీరోలతో జోడీ కట్టేందుకు ఇలాంటి ఇబ్బంది లేదంటున్న ఈ భామ, ఇక మీదట తల్లి పాత్రలో మాత్రం నటించనంటున్నారు. లక్కీ భాస్కర్ కథ బాగా నచ్చటం వల్లే ఆ సినిమాలో మదర్ రోల్‌లో చేశా అన్నారు. ఇక మీదట అలాంటి పాత్రలు ఎట్టి పరిస్థితుల్లో చేయనని క్లారిటీ ఇచ్చేశారు. గత ఏడాది సూపర్ ఫామ్‌లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త స్లో అయ్యారు. 2025లో ఒక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రమే చేసిన ఈ భామ, ప్రజెంట్ అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాల తరువాత మళ్లీ కెరీర్ స్పీడు పెరుగుతుందని ఆశిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vaani Kapoor: సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ
శ్రీలీల Vs పూజా.. పొరుగు పోటీలో గెలిచేదెవరు?
వచ్చే ఏడాది మార్చ్ లో మాస్ సినిమాల జాతర
Anil Ravipudi: అనిల్ రావిపూడి.. సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తున్నారా ..?
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

