Mass Jathara: మాస్ జాతర పై బాహుబలి ప్రభావం ఎంత
మామూలుగా కొత్త సినిమాల మధ్య పోటీ ఉంటే ఓకే.. కానీ ఓ పాత సినిమా కొత్త సినిమా మధ్య పోటీ అంటేనే వినడానికి కూడా కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడిలాంటి అరుదైన పోటీ చూడబోతున్నాం. మొన్నామధ్య ఓసారి ఇదే జరిగితే.. పాత సినిమా దెబ్బకు కొత్త సినిమా తోకముడిచింది. మరి ఈసారేం జరగబోతుంది..? ఇంతకీ ఏ సినిమాల మధ్య ఆ పోటీ..? మహేష్ బాబు ఖలేజా సినిమా రీ రిలీజ్ గుర్తుందా..? మే 30న ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తే ఎగబడి చూసారు ఫ్యాన్స్.
రీ రిలీజ్‌లలో రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చింది ఖలేజా. ఈ సినిమా దెబ్బకు అదేరోజు విడుదలైన భైరవంకు దెబ్బ తప్పలేదు. ముగ్గురు హీరోలు కలిసొచ్చినా కూడా మహేష్ ఖలేజాతో పోటీ పడలేకపోయారు. భైరవం, ఖలేజా టాపిక్ ఇప్పుడెందుకు అనుకోవచ్చు..? కానీ అక్టోబర్ 31న మరోసారి ఇలాంటి పోటీ రిపీట్ అవుతుంది. ఈసారి గెలుపెవరిదో తెలియదు కానీ పోటీ మాత్రం రసవత్తరంగా ఉండబోతుంది. అక్టోబర్ 21న మాస్‌జాతర జరిపించడానికి వచ్చేస్తున్నారు రవితేజ. భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మాస్ జాతర టీజర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ఇది.. పైగా ఇందులో వింటేజ్ రవితేజ కనిపిస్తున్నారు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ రైల్వే పోలీస్‌గా నటిస్తున్నారు మాస్ రాజా. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని రవితేజకు మాస్ జాతర విజయం కీలకంగా మారింది. అంతా బాగానే ఉంది కానీ అక్టోబర్ 31నే బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానుంది. రీ రిలీజే అయినా 2 పార్ట్స్ కలిపి సింగిల్ పార్ట్ సినిమాగా దీన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడే ఆసక్తి పెరిగిపోతుంది. పైగా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు రాజమౌళి అండ్ టీం. ఈ సినిమాతో కచ్చితంగా మాస్ జాతరకు పోటీ తప్పదు. అది ఏ స్థాయిలో ఉంటుందనేది ఆ రోజే తేలనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pooja Hegde: రీ ఎంట్రీ కోసం పూజా హెగ్డే తంటాలు
Krithi Shetty: టాలెంట్ చూపిస్తున్న కృతి.. ఇప్పుడు ఉపయోగం లేదంటున్న ఫ్యాన్స్
Tamannaah Bhatia: అడ్వెంచర్ రోల్స్ కావాలంటున్న తమన్నా
వానాకాలానికి.. నో ఎండ్ వచ్చే రెండ్రోజులూ వానలే
జియో మరో సంచలనం.. రూ.799లకే సేఫ్టీ ఫోన్లు..విద్యార్థులకు ఫ్రీగా ఏఐ కోర్సు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

