AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krithi Shetty: టాలెంట్ చూపిస్తున్న కృతి.. ఇప్పుడు ఉపయోగం లేదంటున్న ఫ్యాన్స్

Krithi Shetty: టాలెంట్ చూపిస్తున్న కృతి.. ఇప్పుడు ఉపయోగం లేదంటున్న ఫ్యాన్స్

Phani CH
|

Updated on: Oct 10, 2025 | 5:14 PM

Share

ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది నాకు అంటూ ఓ డైలాగ్ ఉంటుంది కదా..! కృతి శెట్టికి ఇప్పుడిది బాగా సూటవుతుంది. కొన్నాళ్లుగా హిట్స్‌కి దూరంగా ఉన్న బేబమ్మ.. జాతకం మార్చుకోవడం కోసం ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అయిందా..? ఆఫర్స్ క్యూ కడుతున్నాయా..? గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం కలిసొస్తుందా లేదా..? చూస్తున్నారుగా.. ఇక్కడ కనిపిస్తున్నది కృతి శెట్టి కాదు.. ఆమె 2.0 వర్షన్. గ్లామర్ డోర్స్ పూర్తిగా ఓపెన్ చేసిన బేబమ్మ ఇక్కడ కనిపిస్తుంది.

జీని సినిమా కోసం అమ్మడి అరబిక్ డాన్సుల్లో కూడా కుమ్మేస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫుల్ వీడియో సాంగ్ ఇచ్చేసారిప్పుడు. ఈ పాటలో కృతితో పాటు కళ్యాణి ప్రియదర్శన్ కూడా కనిపిస్తున్నారు. ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన కృతి శెట్టి కెరీర్‌కు ఆ తర్వాత ఆటు పోట్లు తప్పలేదు. ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునేలోపే వరసగా ఫ్లాపులొచ్చాయి. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది. తెలుగులో కృతికి ఆఫర్స్ నిల్.. ఇక్కడ మనమే తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయారు. ఇదే సమయంలో తమిళ, మలయాళం నుంచి మాత్రం ఈమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మలయాళంలో ARM సినిమాతో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కృతి.. తమిళంలోనూ కార్తి, జయం రవి, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే గ్లామర్ షో చేసిన కృతి శెట్టి… ఇప్పుడు సినిమాల్లోనూ మొదలు పెట్టారు. విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న LIKలో కృతి గ్లామర్ ప్రధానాకర్షణ. అలాగే వా వాతియార్‌లోనూ ఫుల్లుగా అందాలను ఆరబోస్తున్నారు బేబమ్మ. ఇక సోషల్ మీడియాలో చెప్పనక్కర్లేదు.. మొత్తానికి అందమే ఆయుధంగా దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tamannaah Bhatia: అడ్వెంచర్ రోల్స్ కావాలంటున్న తమన్నా

వానాకాలానికి.. నో ఎండ్‌ వచ్చే రెండ్రోజులూ వానలే

జియో మరో సంచలనం.. రూ.799లకే సేఫ్టీ ఫోన్లు..విద్యార్థులకు ఫ్రీగా ఏఐ కోర్సు

షోరూం ముందే స్కూటీని తగలబెట్టిన యజమాని.. కారణం ఇదే..

Viral Video: బంగారంతో చేసిన అదిరేటి డ్రెస్ ధరించిన యువతి.. ధర తెలిస్తే దడే

Published on: Oct 10, 2025 05:11 PM