టాలెంట్ కి ఏజ్ తో పనేంటంటున్న నాయికలు

Edited By:

Updated on: Nov 24, 2025 | 8:38 PM

ఏజ్ బార్ లేని హీరోయిన్లుగా మలైకా అరోరా, శ్రియా శరణ్, మంజు వారియర్ వంటి తారలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా విభిన్న పాత్రలు పోషిస్తూనే, స్పెషల్ సాంగ్స్‌తో హీట్ పెంచుతున్నారు. తమ చలాకీదనంతో, నిత్య యవ్వన సౌందర్యంతో, అద్భుతమైన మెయింటెనెన్స్‌తో వీరు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు, వయసు కేవలం ఒక సంఖ్య అని నిరూపిస్తున్నారు.

ఏజ్‌ బార్‌ హీరోయిన్లు అని అంటే ఇప్పుడు ఎవరూ ఒప్పుకోరు. ఆడియన్స్ ని అలరిస్తున్నంత సేపు ఏజ్‌తో పనేం ఉంది? అని జబర్దస్త్ గా అడిగేస్తారు. అలాంటివారిలో ముందుంటారు మలైకా అరోరా అండ్‌ శ్రియ. ఓ వైపు ఏజ్‌కి తగ్గ రోల్స్ చేస్తూనే ఉన్నా.. మరో వైపు స్పెషల్‌ సాంగులతోనూ హిట్‌ వైబ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఏజ్‌ ఏమాత్రం కనిపించకుండా చలాకీగా ఉండే భామల్లో మలైకా అరోరాకి టఫ్‌ కాంపిటిషన్‌ ఇచ్చేవారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఎవరూ అంతగా వండర్‌ కావాల్సిన అవసరం లేదేమో. లేటెస్ట్ గా థామాలో ఆమె స్పెషల్‌ సాంగ్‌ చూసిన వారు కూడా అదే అనుకుంటున్నారు. నార్త్ లో మలైకా అరోరాతో, సౌత్‌ శ్రియని పోల్చి చూసుకుంటున్నారు. ఈ మధ్య రెట్రోలో స్పెషల్‌ సాంగ్‌ చేశారు శ్రియా శరణ్‌. ఈ సాంగ్‌ అంతగా క్లిక్‌ కాకపోయిన, లేటెస్ట్ గా హీరో తల్లిగా మిరాయ్‌లో ఆమె నటన మాత్రం ఆకట్టుకుంది. ఓ వైపు ఏజ్‌కి తగ్గ రోల్స్ చేస్తున్నా.. అడపాదడపా స్పెషల్‌ సాంగ్స్ మాత్రం శ్రియాని పలకరిస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా కోలీవుడ్‌లో ఆమె చేసిన సాంగ్‌ యమా హాట్‌గా ఉందనే టాక్‌ వైరల్‌ అవుతోంది. స్పెషల్‌ సాంగ్‌ అని స్పెషల్‌గా మెన్షన్‌ చేయకపోయినా.. ఫర్టీ ప్లస్‌ హీరోయిన్లు, వాళ్ల వండర్‌ఫుల్‌ మెయింటెనెన్స్ గుర్తుకొచ్చిన ప్రతిసారీ మంజు వారియర్‌ని మిస్‌ కారు జనాలు. రీసెంట్‌గా రజనీకాంత్‌ పక్కన ఆమె వేసిన స్టెప్పలు కూడా జోరుగానే వైరల్‌ అయ్యాయి. ఇప్పటికీ చాలా చోట్ల మారుమోగుతోంది మనసిలాయో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ

సమ్మర్‌లో మెగా కార్నివాల్.. చికిరి చికిరితో స్టార్ట్

ఈ రైలెక్కితే 8 రోజుల ప్రయాణం.. ఎక్కడో తెలుసా ??

నా దారి అడ్డదారి అంటూ వెళ్లబోయిన శునకం.. చివరికి

స్కూలు వెనుక నీటి గుంతలో చప్పుడు.. వెళ్ళి చూసి షాక్