Vijay Sethupati : మక్కల్ సెల్వన్ జోరు అస్సలు తగ్గట్లేదుగా.. తెలుగులో మరోసారి పవర్ ఫుల్ రోల్..

Vijay Sethupati : మక్కల్ సెల్వన్ జోరు అస్సలు తగ్గట్లేదుగా.. తెలుగులో మరోసారి పవర్ ఫుల్ రోల్..

Anil kumar poka

|

Updated on: Jul 10, 2022 | 9:33 AM

వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి. ఉప్పెన మూవీలో రాయనం పాత్రలో అద్భుతమైన నటన కనబర్చి తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు ఈ హీరో.


వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి. ఉప్పెన మూవీలో రాయనం పాత్రలో అద్భుతమైన నటన కనబర్చి తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు ఈ హీరో. ఇటీవలే కాతు వాకుల రెండు కాదల్ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు విజయ్. కేవలం హీరోయిజం మాత్రమే కాకుండా విలనిజాన్ని పండించడంలోనూ మక్కల్ సెల్వన్ దిట్ట. విజయ్ తళపతి నటించిన మాస్టర్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించి మెప్పించాడు. ఇక మరోసారి ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నారని టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రాబోతున్న పుష్ప 2లో మక్కల్ సెల్వన్ కీలకపాత్రలో కనిపించనున్నారని గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ నటిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ..విజయ్ సేతుపతికి మరో రెండు భారీ చిత్రాల ఆఫర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో ఒకటి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న చిత్రం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరో పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారని.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా మరో పాన్ ఇండియా చిత్రంలోనూ విజయ్ కు ఛాన్స్ వచ్చిందని.. ప్రస్తుతం చిత్రయూనిట్ మక్కల్ సెల్వన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో విజయ్ మంచి జోరుమీదున్నారనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 10, 2022 09:33 AM