Klin Kaara Caretaker: రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్..

|

Aug 03, 2024 | 10:26 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన ఇద్దరిదీ బిజీ లైఫ్. అందుకే వారు తమ ముద్దుల పాప క్లీంకార కోసం ఒక స్టార్ కేర్ టేకర్ ను నియమించారు. ఆమె పేరు లలిత. లలిత గతంలో అంబానీ కుటుంబంలో చిన్నారులకు కూడా కేర్ టేకర్ గా పనిచేశారు. ప్రస్తుతం క్లీంకార కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్-ఉపాసన దంపతుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన ఇద్దరిదీ బిజీ లైఫ్. అందుకే వారు తమ ముద్దుల పాప క్లీంకార కోసం ఒక స్టార్ కేర్ టేకర్ ను నియమించారు. ఆమె పేరు లలిత. లలిత గతంలో అంబానీ కుటుంబంలో చిన్నారులకు కూడా కేర్ టేకర్ గా పనిచేశారు. ప్రస్తుతం క్లీంకార కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్-ఉపాసన దంపతుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను అంబానీ ఫ్యామిలీ సహా అనేక సంపన్న కుటుంబాల్లోని చిన్నారులకు కేర్ టేకర్ గా వ్యవహరించానని వెల్లడించారు. తనను ఆ కుటుంబాలన్నీ బాగా చూసుకున్నాయని తెలిపారు. ఇక, రామ్ చరణ్-ఉపాసన తమ కుమార్తె క్లీంకార విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తారని, మంచి తల్లిదండ్రులకు వాళ్లను ఉదాహరణగా చెప్పొచ్చని అభిప్రాయపడ్డారు. వారిద్దరిదీ మంచి మనసు అని కితాబునిచ్చారు. గతంలో తాను ఉత్తరాది కుటుంబాల్లో కేర్ టేకర్ గా చేశానని, అయితే, అక్కడికి ఇక్కడికి ఆహారపు అలవాట్లలో చాలా తేడా ఉంటుందని లలిత పేర్కొన్నారు. రామ్ చరణ్ కుటుంబం చాలా మంచిదని కొనియాడారు. ఉపాసన అపోలో ఫౌండేషన్ చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ, ఎంతో నిరాడంబరంగా ఉంటారని తెలిపారు. తాను విశ్రాంతి తీసుకునేటప్పుడు క్లీంకారను ఉపాసన చూసుకుంటారని, పాపను ఎత్తుకో, సరిగ్గా చూసుకో అంటూ ఒత్తిడి చేయరని, ఉపాసన ఎంతో వినయశీలి అంటూ లలిత వివరించారు. అంతేకాదు, వారి కుటుంబంలో తనను కూడా ఓ సభ్యురాలిగానే చూస్తారని సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.