Keerthy Suresh: ముఖంపై గాయాలతో మహానటి.. కీర్తి సురేష్‏కు ఏమైంది ??

|

May 08, 2023 | 9:46 AM

ఇటీవల దసరా బ్లాక్ బస్టర్ హిట్‏తో ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ కీర్తి సురేష్. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఊరమాస్ లుక్‌లో కీర్తి నటన ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది.

ఇటీవల దసరా బ్లాక్ బస్టర్ హిట్‏తో ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ కీర్తి సురేష్. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఊరమాస్ లుక్‌లో కీర్తి నటన ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. మరోసారి వెన్నెల పాత్రతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం కీర్తి.. భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో చిరంజీవి చెల్లిగా కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ కోల్‌కత్తాలో జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో కీర్తి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో మొహామంతా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అంతేకాకుండా.. కీర్తి ఎడమ కంటికి గాయమైనట్లుగా కనిపిస్తుంది. అయితే ఇదంతా నిజంకాదు.. కేవలం గతంలో తాను నటించిన ఓ సినిమా చిత్రీకరణకు సంబంధించిన వీడియో. కీర్తి సురేష్, డైరెక్టర్ సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన చిత్రం సాని కాయిదం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్లం, వెల్లుల్లి ప్యాకెట్స్ కొంటున్నారా ?? అయితే మీ ఆరోగ్యం షెడ్ కు వెళ్ళినట్లే

వామ్మో.. ఆ మహిళ బ్యాగునిండా పాములే..

శాడిస్ట్‌ మేకపిల్ల.. ఏం చేసిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు

వింత తాబేలు.. దీన్ని చూస్తే అదిరిపడతారు..

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాగచైతన్య కస్టడీ ట్రైలర్..