Karthi Satyam Sundaram OTT: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సత్యం సుందరం మూవీ
ఇటీవల దేవరకు పోటీగా వచ్చి డీసెంట్ హిట్ అందుకున్న సినిమా సత్యం సుందరం. కోలీవుడ్ స్టార్స్ కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని మంచి రివ్యూస్ వచ్చాయి. ఇక ఎప్పటిలాగే కార్తి, అరవింద్ స్వామి తమ నటనతో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టారు.
అలాంటి ఈ సినిమా నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఓ న్యూస్ బయటికి వచ్చింది. తమిళంలో 96 వంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా… ఈ నెట 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తమ సోషల్ మీడియాలో హ్యాండిల్స్‌లో ఓ పోస్ట్ ను పెట్టింది. సత్యం సుందరం సినిమాలో పాటలు ఎక్కువగా లేవు. అలాగే యాక్షన్ ఫైట్ సీన్స్ కూడా లేదు. కానీ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే సరికొత్త కంటెంట్ ఇందులో ఉంది. కథ అయితే చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. అందులోనూ ఎలాంటి ట్విస్టులు కూడా లేకుండా సుమారు 3 గంటల పాటు దర్శకుడు ప్రేక్షకులను మెప్పించడం చాలా గొప్ప విషయం. ఇక చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా… బాక్సాఫీస్ దగ్గర దాదాపు 60 కోట్ల రూపాలయను వసూలు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రేజీ న్యూస్.. NTR సినిమాలో షారుఖ్ ఖాన్
Chandrababu Naidu Season 4: తన అరెస్ట్ గురించి చెబుతూ చంద్రబాబు ఎమోషనల్
వీరిద్దరూ విడిపోవడానికి.. ఆ హీరోయినే కారణమా ??
Ram Charan: వచ్చే వేసవి నాటికి చెర్రీ మైనపు విగ్రహం రెడీ !!
బంగారానికి బాబులా వెండి ధర.. కిలో రూ.1 లక్ష.. కొంటే మంచిదేనా ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

