స్టార్ హీరోల రికార్డ్‌లకు అడ్డుపడుతున్న ఓటీటీ
ఈ మధ్యకాలంలో వెండితెర మీద ఓటీటీల పెత్తనం గురించి చర్చ బాగా జరుగుతోంది. ముఖ్యంగా భారీ సినిమాల రిలీజ్‌డేట్‌లను కూడా ఓటీటీలే డిసైడ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే... బిగ్ హిట్ అయిన సినిమాల థియెట్రికల్ రన్ కంటిన్యూ అవుతుండగానే ఓటీటీలో రిలీజ్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. దీంతో భారీ రికార్డులకు చేరువలో ఉన్న సినిమాలు కూడా తడబడుతున్నాయి.
ఈ ఏడాది అత్యథిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా కాంతార ఛాప్టర్ 1. కాంతారకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. అన్ని భాషల్లో కలిపి 800 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌డేట్‌ను ప్రకటించింది టీమ్. అక్టోబర్ 31న ఓటీటీలోకి రానుంది కాంతార ఛాప్టర్ 1. ఈ ఎనౌన్స్‌మెంట్‌తో కన్నడ అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరోసారి కన్నడ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతుందని ఆశిస్తున్న టైమ్‌లో ఎర్లీగా ఓటీటీకి రిలీజ్ చేయటం ఏంటని పెదవి విరుస్తున్నారు ఫ్యాన్స్. కానీ ముందే జరిగిన అగ్రిమెంట్ల కారణంగా చిత్రయూనిట్‌కు డిజిటల్ రిలీజ్ చేయక తప్పటం లేదు. రీసెంట్‌గా ఓజీ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఓజీ సినిమా 300 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి 500 కోట్ల దిశగా దూసుకుపోతున్న టైమ్‌లో ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దీంతో థియెట్రికల్ రన్ ఎఫెక్ట్ అయ్యింది. ఓటీటీ రిలీజ్ తరువాత ఓజీ వసూళ్లు భారీగా పడిపోయాయి. స్టార్ హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఓటీటీ కమిట్మెంట్స్ కారణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మిరాయ్, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలను కూడా థియెట్రికల్ రన్ కొనసాగుతుండగానే ఓటీటీలో రిలీజ్ చేశారు. సినిమా ప్లాప్ అయినప్పుడు ఎర్లీ రిలీజ్‌కు ఓకే అంటున్న ఓటీటీ సంస్థలు సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం డిజిటల్ రిలీజ్ వాయిదా వేసేందుకు ఒప్పుకోవటం లేదు. ఏది ఏమైనా మా మాటే నెగ్గాలన్నట్టుగా ఉన్న ఓటీటీల తీరుకు చెక్ పెట్టడం సాధ్యమయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా
Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల
Krrish 4: క్రిష్ మూవీలో జాకీచాన్.. డీల్ ఓకేనా
‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా
నిర్మాతలకు సీఎం రేవంత్ ఝలక్ టికెట్ రేట్లు పెంచాలంటే ఆ పని చేయాల్సిందే
