Samantha: నేను మౌనంగా ఉన్నానంటే తప్పు అంగీకరించానని కాదు.. సమంత లేటెస్ట్ ట్వీట్..
ఇటీవల నాగచైతన్య నుంచి విడిపోయాక.. సమంత సోషల్ మీడియాలో ఏ కామెంట్ చేసినా విపరీతమైన ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా ఆమె బౌద్ధ మత గురువు దలైలామా కొటేషన్ ను ఉదహరించి మరోసారి కలకలం రేపారు. తరచూ ఆసక్తికర ఫొటోలు, సరదా వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానుల్ని
ఇటీవల నాగచైతన్య నుంచి విడిపోయాక.. సమంత సోషల్ మీడియాలో ఏ కామెంట్ చేసినా విపరీతమైన ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా ఆమె బౌద్ధ మత గురువు దలైలామా కొటేషన్ ను ఉదహరించి మరోసారి కలకలం రేపారు. తరచూ ఆసక్తికర ఫొటోలు, సరదా వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరించే సమంత తాజాగా పెట్టిన ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది. మౌనం, దయ.. తదితర అంశాలపై బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామ రాసిన కోట్‌ను చెప్పడమే ఇందుకు కారణం. ‘‘నేను మౌనంగా ఉన్నానంటే పట్టించుకోవడంలేదని, ఏమీ మాట్లాడటం లేదంటే తప్పు అంగీకరించానని కాదు. నా దయార్ధ హృదయాన్ని బలహీనత అని మీరు పొరపడొద్దు. దయ, క్షమాగుణానికి కూడా ఓ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది’’ అనే మాటలతో సమంత ట్వీట్ చేసింది. దాంతో ఎవరిని ఉద్దేశించి ఆమె అలా ట్వీట్ చేసింది? అసలు ఏం జరిగింది? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ‘ఓ నెటిజన్ ట్రోల్ వల్ల ఇలా చేసింది’ అని కొందరంటే.. ‘ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఇలా పెట్టింది’ అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. నయనతార, విజయ్ సేతుపతితో కలిసి సమంత నటించిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral Video: భార్యను వదిలి ప్రియురాలితో జంప్.. ఖర్చులతో సహా.. దిమ్మదిరిగే షాకిచ్చిన కోర్టు..!
Donkey Race: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోతుంది..!
Scotch,whiskey prices: మద్యం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు.!
Snake-Rat: తక్కువ చేస్తే ఇట్లనే ఉంటది.. పాముకు చుక్కలు చూపించిన ఎలుక.. వీడియో చూస్తే షాకవుతారు..!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

