కొత్త షో స్టార్ట్ చేసిన జగపతి బాబు! రిబ్బన్ కట్‌ నాగార్జునతోనే…

Updated on: Aug 14, 2025 | 1:16 PM

తెలుగులో ఇప్పటికే చాలా టాక్ షోలు ఉన్నాయి. అవన్నీ సక్సెస్‌ ఫుల్‌గా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాయి. తెలుగు ప్రజలను ఎంటర్‌టైన్ చేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నయా టాక్ షో రాబోతోంది. హీరోగా టూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి.. తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న జగపతి బాబు పేరు మీదే.. ఆయన హోస్టింగ్‌లోనే ఈ నయా టాక్ షో సాగనుంది.

అయితే ఈ ఫస్ట్ షో టీజర్‌ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. కింగ్ నాగ్‌తో జగ్గూ భాయ్ క్రాస్ ఫైర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మొట్టమొదటిసారిగా నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తు జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి షో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్ఫణలో స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ షోను ప్రొడ్యూస్ చేస్తున్నారు. జీ తెలుగులో టెలీకాస్ట్ కానుంది ఈ షో. వారం వారం సినీ ప్రముఖులు గెస్టులుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలువనుందని మేకర్స్ అంటున్నారు. ఈ క్రమంలోనే ఫస్ట్ గెస్ట్‌గా టాలీవుడ్ కింగ్ నాగార్జున జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి షోకు విచ్చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో రీసెట్‌గా రిలీజ్‌ అయి అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ షో ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. జగపతి టాక్ షో.. ఫస్ట్ ఎపిసోడ్ ఆగస్టు 17 ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో టెలీకాస్ట్ కానుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో నాగార్జున తన కెరీర్, వ్యక్తిగత జీవితం, కుటుంబ సంగతులతోపాటు సూపర్ హిట్ సినిమాల నుంచి అన్నపూర్ణ స్టూడియోస్తో తన అనుబంధం వరకు మరెన్నో విశేషాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. బుల్లితెరపై మొదటిసారిగా నటుడు జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి కార్యక్రమంతో వ్యాఖ్యాతగా మారి తనదైన స్టైల్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు వినోదం పంచనున్నారు. తెలుగు సినిమాల్లో మూడు దశాబ్దాలకు పైగా తన నటనా ప్రతిభతో ఆకట్టుకుంటున్న జగపతి బాబు ఈ నయా రోల్లో ఎలా అదరగొడతారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విధి ఆడిన వింత నాటకంలో.. పాపం! చాలా కామెడీగా బలయ్యాడుగా..

ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సైయారా OTT డేట్స్‌ ఫిక్స్‌

Upasana Konidela: ‘నా భర్త కౌంట్ 199 ‘ చరణ్‌ సీక్రెట్ బయటపెట్టిన ఉపాసన

జాలరి పంట పండిందిగా.. వలలో చిక్కింది చూసి షాక్

రైల్వే సరికొత్త ఆఫర్.. టికెట్ ధరలో రాయితీ