రోజా కాళ్ల మీద పడి ఏడ్చిన జబర్దస్త్ కమెడియన్

Updated on: May 14, 2025 | 1:56 PM

తన రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో.. గత కొంత కాలంగా జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు. కిడ్నీ సమస్యతో పాటు థైరాయిడ్ తదితర సమస్యలతోనూ బాగా అవస్థలు పడ్డాడు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నటీనటులు, తోటి యాక్టర్లు తలో చేయి వేయడంతో పంచ్ ప్రసాద్ కోలుకున్నాడు. సర్జరీ కూడా విజయవంతమైందని ఆ మధ్యన ఒక షోలో చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతానికైతే అతను మళ్లీ మనుపటి లాగే యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. జబర్దస్త్ షోలో మళ్లీ పంచులు, ప్రాసలు పేలుస్తున్నాడు. అయితే పంచ్ ప్రసాద్ చికిత్సకు సాయం చేసిన వారిలో జబర్దస్త్ మాజీ జడ్జి, ప్రముఖ నటి రోజా కూడా ఉన్నారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ప్రసాద్ చికిత్సకు అవసరమైన సాయం అందించారామే. ఇప్పుడిదే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడీ కమెడియన్. గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు.. రోజాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు పంచ్‌ ప్రసాద్. తాజాగా వీరద్దరు ఓ టీవీషోలో కనిపించారు. ఈ క్రమంలోనే రోజా పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరచాడు పంచ్ ప్రసాద్. ఈ రోజు తాను తన భార్యపిల్లలతో ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నానంటే కారణం.. మీరు పెట్టిన భిక్ష అంటూ రోజా ముందు ఎమోషనల్ అయ్యాడు. తన ట్రీట్‌మెంట్ కోసం రోజా ఎంతో సాయం చేశారని.. ఈ అమ్మ తన సొంత అమ్మ కన్నా.. ఎక్కువ అంటూ రోజా స్టేజ్ మీదకి రాగానే కన్నీళ్లతో.. కాళ్ల మీద పడ్డాడు ప్రసాద్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా జీవితంలో ధోనీ.. ఒక మాయని మచ్చ! షాకింగ్ కామెంట్స్‌ చేసిన హీరోయిన్

విశాల్ హెల్త్‌ అప్డేట్..! డాక్టర్స్ సీరియస్ వార్నింగ్