Sukumar: డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ పైనా ఐటీ ఫోకస్ పెట్టింది. ఇటీవలే పుష్ప 2తో సుకుమార్ భారీ విజయాన్ని అందుకున్నాడు. పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు భావిస్తున్నారు. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు.
21వ తేదీ నుంచి ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లల్లో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు, శిరీష్, మైత్రి మూవీ మేకర్స్, అలాగే మ్యాంగో మీడియా సంస్థలపై దాడులు చేశారు. ఇళ్లు, ఆఫీసులు ఏదీ వదలకుండా రైడ్స్ చేశారు. పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంటి పై ఐటీ రైడ్స్ జరిగాయి. అసలు సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత..? వచ్చిన ఆదాయం ఎంత? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ఇటీవల చాలా సంస్థలు తమ సినిమాలకు భారీగా పెట్టుబడి పెట్టామని.. సినిమా ఇంత బిజినెస్ చేసిందని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా పెట్టుబడి.. వచ్చిన ఆదాయం.. కడుతున్న ఇన్‌కం ట్యాక్స్ విషయంలో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డార్క్‌వెబ్ వ్యవస్థాపకుడికి ట్రంప్ క్షమాభిక్ష
ట్రంప్ నిర్ణయంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు
లోయలో పడ్డ లారీ.. 10 మంది రైతులు మృతి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

