Sobhita Dhulipala: నథింగ్ అనుకునేరు.. కోట్లలో సంపాదన ఈమెది

|

May 28, 2024 | 11:58 AM

పాన్ ఇండియా మూవీ లవర్స్‏కు శోభితా ధూలిపాళ సుపరిచితమే. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‎తో కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగమ్మాయి అయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటింది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది శోభితా. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మోడలింగ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తార..

పాన్ ఇండియా మూవీ లవర్స్‏కు శోభితా ధూలిపాళ సుపరిచితమే. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‎తో కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగమ్మాయి అయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటింది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది శోభితా. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మోడలింగ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన తార.. ఇప్పుడు సినీ రంగుల ప్రపంచంలో హీరోయిన్‏గా దూసుకుపోతోంది. ఈ ఏడాది దేవ్ పటేల్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి శోభితా అడుగుపెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పటికే నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుని తనను తాను నిరూపించుకుంది. ఇక తన టీనేజ్‌లో ముంబయ్‌లో కార్పొరేట్ లా చదివిన శోభితా.. వార్షిక నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్‌గా ఎన్నికైంది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో విక్కీ కౌశల్ సరసన స్మృతికా నాయుడు పాత్రలో నటించింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన శోభితా.. ఆ తర్వాత సినిమాల్లో సక్సెస్ ఫుల్‌గా కంటిన్యూ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది మామూలు పక్షి ఈక‌ కాదు.. 25 తులాల బంగారం కంటె ధర ఎక్కువ

ఇంటర్నెట్‌తో పన్లేదు, చార్జింగ్ అవసరం లేదు.. సింపుల్‌గా ఫోన్‌తోనే పేమెంట్స్

విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే యత్నం..

బాలుడికి ‘ఐరన్ మ్యాన్’ తరహా బయోనిక్ చెయ్యి

వేలమంది ప్రయాణీకుల ప్రాణాలతో లోకోపైలెట్ల చెలగాటం