Padmapriya: డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.! హీరోయిన్ ఆవేదన.
హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మరోసారి బహిరంగ చర్చ మొదలైంది.హేమ రిపోర్టు బయటపెట్టిన తర్వాత కన్నడతో పాటు పలు భాషల్లో నటీమణులు తమపై జరుగుతున్న, లైంగిక దాడి, మానసిక హింస గురించి మాట్లాడుతున్నారు. తమ సినీ పరిశ్రమలో కూడా హేమ కమిటీ లాంటిది ఓ కమిటీ వేయాలని పలువురు హీరోయిన్స్ అంటున్నారు.
హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మరోసారి బహిరంగ చర్చ మొదలైంది.హేమ రిపోర్టు బయటపెట్టిన తర్వాత కన్నడతో పాటు పలు భాషల్లో నటీమణులు తమపై జరుగుతున్న, లైంగిక దాడి, మానసిక హింస గురించి మాట్లాడుతున్నారు. తమ సినీ పరిశ్రమలో కూడా హేమ కమిటీ లాంటిది ఓ కమిటీ వేయాలని పలువురు హీరోయిన్స్ అంటున్నారు. ఈ క్రమంలోనే యాక్టర్ పద్మప్రియ తన ఫిల్మ్ కెరీర్లోని ఓ చేదు విషయం గురించి తాజాగా బయట పెట్టారు. ఓ తమిళ డైరెక్టర్ అందరి ముందే తనపై చేసుకున్నారని ఎమోషనల్‌గా చెప్పారు.
మల్టీట్యాలెంటెడ్ యాక్టరస్ గా నామ్ కమాయించిన పద్మప్రియ.. 2004లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పలు భాషల్లోని ప్రముఖ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తన నటనకు గానూ ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఇక ఇప్పటికీ తన యాక్టింగ్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ కాలేజ్ ఈవెంట్‌కు వెళ్లారు. ఆ ఈవెంట్ వేదికగా 2007లో రిలీజ్ అయిన ‘మృగం’ అనే తమిళ చిత్రం షూటింగ్ సమయంలో తనకు జరిగిన జరిగిన షాకింగ్ ఇన్‌సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు.
మృగం సినిమా షూటింగ్ చివరి రోజు దర్శకుడు స్వామి అందరి ముందు తనను చెంప పై కొట్టారంటూ పద్మ ప్రియ చెప్పారు. ఆ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ఎమోషనల్ అయ్యారు. కానీ మీడియా మాత్రం ఈ ఘటనను రివర్స్‌లో ప్రసారం చేసిందని.. ఆ దర్శకుడిని తాను కొట్టానంటూ న్యూస్ వచ్చిందంటూ చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఘటనపై తమిళ సినీ సంఘాలకు ఫిర్యాదు చేశానని.. కానీ ప్రయోజనం లేకపోయిందంటూ తన అసహనం వ్యక్తం చేశారు ఆమె. ఇక ఆ సంఘటన వల్ల.. తాను కొన్ని సినిమాల నుంచి తప్పుకోవాలసి వచ్చిందని కూడా అన్నారు. కానీ తాను ‘మృగం’లో నటించినందుకు తనకు ఉత్తమ నటిగా ఆ సంవత్సరం అవార్డ్ వచ్చిందంటూ.. నవ్వుతూ చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.