Raghu Thatha: 24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ.!

|

Sep 17, 2024 | 9:11 AM

ఇటీవల మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రఘు తాత'. ఈ సినిమాను హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించగా.. సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా తమిళ్, మలయాళ భాషల్లో థియేటర్లో రిలీజ్‌ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో ఓటీటీ రిలీజైన ఈ సినిమా మంచి వ్యూయర్షిప్‌తో దూసుకుపోతోంది.

ఇటీవల మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రఘు తాత’. ఈ సినిమాను హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించగా.. సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా తమిళ్, మలయాళ భాషల్లో థియేటర్లో రిలీజ్‌ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో ఓటీటీ రిలీజైన ఈ సినిమా మంచి వ్యూయర్షిప్‌తో దూసుకుపోతోంది. సెప్టెంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో రఘతాత మూవీ స్ట్రీమ్‌ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. వైవిధ్య‌మైన పాత్ర‌లు, క‌థాంశంతో రూపొందిన ‘రఘు తాత’ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. న‌మ్మిన దాని కోసం నిల‌బ‌డే స్వ‌తంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్ర‌లో కీర్తి సురేష్ మరోసారి అద్భుతమైన నటనతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ క‌లిసి చూసే ఎమోష‌న‌ల్ మూవీగా అల‌రిస్తోంది. ఈ క్రమంలోనే ఓటీటీలో రిలీజ్‌ అయిన 24 గంట‌ల్లోనే ఈ మూవీ 50 మిలియ‌న్ స్ట్రీమింగ్స్ ను తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1960 బ్యాగ్ డ్రాప్ లో హిందీ వ్యతిరేక ఉద్యమం అనే రాజకీయ అంశం చుట్టూ కొనసాగుతూ ఉంటుంది సినిమా..! రాజకీయంతోపాటు ఈ మూవీలో లవ్ స్టోరీ కూడా ఉంది. ఇందులో కీర్తితోపాటు ఎంఎస్ భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాజీవ్ రవీంద్రనాథన్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.