Avika Gor: బాడీగార్డు ఉద్యోగమిస్తే.. నాతోనే అసభ్యంగా ప్రవర్తించాడు.! అవికా వీడియో.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది అవికా గోర్. బాలనటిగా బుల్లితెరపై సందడి చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్గా వెండితెరపై అలరిస్తోంది. పన్నెండేళ్ల వయసులోనే నటనలోకి అడుగుపెట్టిన అవిక.. అతి చిన్న వయసులోనే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. తెలుగులో ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది.
బాలనటిగా బుల్లితెరపై సందడి చేసిన అవికా గోర్. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అవికా. తనకు ఎదురైన కొన్ని చేదు సంఘటనల గురించి ఈమధ్యే చెప్పింది. తనను కాపాడతాడని ఉద్యోగం ఇచ్చిన ఓ వ్యక్తి.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. పెద్దయ్యాక ఎన్నో హింసలు, సవాళ్లు ఎదుర్కొన్నానని అవికా చెప్పుకొచ్చింది. తనను రక్షించాల్సిన బాడీగార్డు తనతో అనుచితంగా ప్రవర్తించాడని వెల్లడించింది. ఓ ఈవెంట్‌లో బాడీగార్డు తనను దారుణంగా తాకాడని నటి తెలిపింది. అతను రెండుసార్లు అలాగే ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది.
అంతేకాదు అతడు తనతో అసభ్యంగా ప్రవర్తించగానే ..అతడి వైపు చూసి ఏంటీ అని అడగ్గా.. వెంటనే తనకు సారీ చెప్పాడని.. దీంతో ఆ సంఘటనను వదిలేశానని చెప్పింది. వారు అలా ప్రవర్తించినప్పుడు.. అది ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వారికి తెలియదంది. అలా ప్రవర్తించినప్పుడు అతడిని కొట్టే ధైర్యం ఉంటే.. ఈపాటికి చాలా మందిని కొట్టేదానినని తెలిపింది. కానీ ఇప్పుడు తనకు ఆ ధైర్యం ఉందని.. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కొట్టగలనని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తనలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.