Venkatesh: ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!

|

May 04, 2024 | 10:14 PM

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సినీ హీరో వెంకటేష్. మే 7 నుంచి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు వెంకటేష్. రఘురాం రెడ్డికి సినీ హీరో వెంకటేష్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు వియ్యంకులు అవుతారు. దీంతో తన వియ్యంకుడిని గెలిపించేందుకు వెంకటేష్‌ రంగంలోకి దిగుతున్నారు.

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సినీ హీరో వెంకటేష్. మే 7 నుంచి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు వెంకటేష్. రఘురాం రెడ్డికి సినీ హీరో వెంకటేష్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు వియ్యంకులు అవుతారు. దీంతో తన వియ్యంకుడిని గెలిపించేందుకు వెంకటేష్‌ రంగంలోకి దిగుతున్నారు. ఇక రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు. రఘురాం రెడ్డి తరపున కాంగ్రెస్ మంత్రులు ,నేతలతో పాటు పొంగులేటి కుటుంబ సభ్యులు అందరూ ప్రచారం చేస్తున్నారు..ఇపుడు వియ్యంకుడు తరపున వెంకటేష్ తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించ నున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.