Manchu Manoj – Bhuma Mounika: ‘పిల్లా.. నువ్వంటే ప్రాణమే’ ఒక్క మాటతో భార్యను ఫిదా చేసిన మనోజ్.
టాలీవుడ్ రాక్ స్టార్, హీరో మంచు మనోజ్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని సతీమణి భూమా మౌనిక రెడ్డి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. తన అత్తమ్మ, దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి జయంతి రోజున ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు మనోజ్. ఇక తాజాగా మనోజ్ సతీమణి మౌనికా రెడ్డి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ రాక్ స్టార్, హీరో మంచు మనోజ్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని సతీమణి భూమా మౌనిక రెడ్డి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. తన అత్తమ్మ, దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి జయంతి రోజున ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు మనోజ్. ఇక తాజాగా మనోజ్ సతీమణి మౌనికా రెడ్డి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్‌లో ఎంతో అందంగా మెరిసిపోయింది మౌనిక. ఈ ఫొటోలను చూసిన మనోజ్ కూడా వెంటనే స్పందించాడు. లవ్లీ రిప్లైతో భార్యపై తన ప్రేమను చాటుకున్నాడు. ‘పిల్లా ఓ పిల్లా.. నువ్వంటే నాకు ప్రాణమే’ అంటూ తన పాట లిరిక్స్ ను జత చేసి కామెంట్ పెట్టారు. ప్రస్తుతం మౌనిక బేబీ బంప్ ఫొటోలు, మనోజ్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మౌనిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
