డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌ అంటున్న ఫహాద్ ఫాజిల్‌

Edited By: Phani CH

Updated on: Oct 21, 2025 | 4:44 PM

లాస్ట్ ఇయర్‌ ఈ టైమ్‌కి పుష్ప సీక్వెల్‌ మేనియా మామూలుగా లేదు. ఈ ఏడాది ఈ టైమ్‌కి అదే వైబ్‌ని క్రియేట్‌ చేయాలనుకుంటున్నారు ఫాహద్‌ ఫాజిల్‌. డోంట్‌ డట్రబుల్‌ ది ట్రబుల్‌ అంటూ ఫాహద్‌ నయా వెంచర్‌ని మొదలుపెట్టేశారు. ఫాహద్‌ ఆ డెసిషన్‌ వెనుకున్న ఇంట్రస్టింగ్‌ పాయింట్స్ ఏంటి? చూసేద్దాం వచ్చేయండి. భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు.

పుష్ప రెండు పార్టుల్లోనూ ఆ కేరక్టర్‌కి ఉన్న ఇంపాక్ట్ అలాంటిది. ఆ రేంజ్‌ ఇంపాక్ట్ లేకపోతే సినిమాలకు సైన్‌ చేయరు ఫాహద్‌. తాను మూవీకి సైన్‌ చేశారంటే ఏదో ఉండి తీరుతుందని ప్రేక్షకుల్లో ఎక్కడో కాన్ఫిడెన్స్ ఉంటుందని, దానికి వంద శాతం న్యాయం చేయాలని అనుకుంటారు ఫాహద్‌. తెలుగులో మెయిన్‌ లీడ్‌గా ఆయన నటిస్తున్న సినిమా ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తోనే ఆసక్తి క్రియేట్‌ చేశారు మేకర్స్. మంత్రదండం, పిల్లాడు, ఫాహద్‌ లుక్‌ చూస్తుంటే ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఉందనే విషయం అర్థమవుతోంది. బాహుబలి మేకర్స్ శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనితో కలిసి ఎస్‌ ఎస్‌ కార్తికేయ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నవంబర్‌ 8 వరకు ఫస్ట్ షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది. వచ్చే ఏడాది సినిమాను ప్రస్త్రక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ప్లాన్‌. ఫాహద్‌ మెయిన్‌ లీడ్‌లో తెరకెక్కే ఈ సినిమా కోసం జనాలు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ ఓవర్ థింకింగ్‌ని తగ్గించే జపనీస్ టెక్నిక్స్ ఇవే

లవ్ సింబల్‌లా తాటి చెట్లుపల్లెలో ప్రకృతి దృశ్యం

పసరికపాము అనుకునేరు.. కాటు వేస్తే కాటికే…

టీచర్లకు బిగ్ రిలీఫ్.. ఎగ్జాం పేపర్లు దిద్దుతున్న.. ఏఐ

దేశంలోనే రిచెస్ట్‌ విలేజ్‌‌.. ఇంటికో లగ్జరీ కారు.. బ్యాంకుల్లో వెయ్యి కోట్లు

Published on: Oct 21, 2025 04:42 PM