Samantha: ‘డాక్టర్‌లా ఫీలైపోయి ఉచిత సలహాలు ఇవ్వొద్దు’.. సమంత పై సీరియస్.
సమంత.. స్టార్ హీరోయిన్.. టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు.. బాలీవుడ్‌నూ ఏలేస్తోంది. అంతేకాదు.. సోషల్ మీడియా.. అందులోనూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే.. కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత.. అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్స్, కొటేషన్స్ పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సమంత ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టు ఆమెను వివాదంలోకి లాగింది.
సమంత.. స్టార్ హీరోయిన్.. టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు.. బాలీవుడ్‌నూ ఏలేస్తోంది. అంతేకాదు.. సోషల్ మీడియా.. అందులోనూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే.. కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత.. అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్స్, కొటేషన్స్ పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సమంత ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టు ఆమెను వివాదంలోకి లాగింది. ఇక మయొసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత.. కొన్నాళ్లుగా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్ని అనుసరిస్తోంది. వాటికి సంబంధించిన వివరాల్ని కూడా ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. దానిలో భాగంగానే.. సమంత నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తున్న ఫోటోను షేర్ చేసింది.
అంతేకాదు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు డిస్టిల్డ్ వాటర్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ చెయ్యండని చెప్తూ లివర్ డాక్టర్ తన ఇన్‌స్టాలో పెట్టినట్లు సమంత చెప్పుకొచ్చింది. అంతే.. సమంత చెప్పిన ఆ ఫార్ములాపై కొందరు డాక్టర్లు మండిపడ్డారు. ఆమెపై ఒక్కసారిగా విమర్శలతో విరుకుపడ్డారు. అందులోనూ మెయిన్‌గా హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో చేసే నెబ్యులైజేషన్ గురించి సమంత ప్రస్తావించడంపై అభయ్ ఫిలిప్ అనే లివర్ డాక్టర్ భగ్గుమన్నారు. తనకుతాను డాక్టర్ లా ఫీల్ అయి ఉచిత సలహాలు ఇవ్వొద్దని సమంతకు సూచించారు. సమంత చెప్పిందని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలను హైలైట్ చేస్తూ.. అమెరికాకు చెందిన ఆస్తమా, అలెర్జీ ఫౌండేషన్ హెచ్చరికలను ప్రస్తావించారు. సెలబ్రిటీ ముసుగులో తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్న సమంతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆమెను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు డాక్టర్ అభయ్ ఫిలిప్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

