Sailesh Kolanu – Saindhav: ‘చివరి 20 నిమిషాలు ఉంటది’ ఒక్క లీక్‌తో సైంధవ్‌ను లేపిన డైరెక్టర్.

|

Jan 11, 2024 | 1:11 PM

చాలా కాలం తర్వాత ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు వెంకీమామ. హిట్ యూనివర్స్‏తో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా.. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణి శర్మ కీలకపాత్రలలో నటించగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రయూనిట్ సైంధవ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది.

చాలా కాలం తర్వాత ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు వెంకీమామ. హిట్ యూనివర్స్‏తో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా.. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణి శర్మ కీలకపాత్రలలో నటించగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రయూనిట్ సైంధవ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో సైంధవ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెబుతూ మరిన్ని అంచనాలు పెంచేశారు డైరెక్టర్ శైలేష్ కొలను. “ఇప్పుడే చివరి కాపీలను పంపిణీ చేశాం. సైంధవ్ సినిమా ఇప్పుడు మీదే. నేను మీతో మరో విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సైంధవ్ సినిమాలోని చివరి 20 నిమిషాలు మాత్రం చాలా అనుభవాన్ని ఇస్తుంది. అలాగే ఇదంతా కేవలం వెంకటేష్ వల్లే సాధ్యమైంది. ఆయన అపూర్వమైన నటుడు.. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆయనను డైరెక్ట్ చేయడం అసలు ఊహించలేదు. అందుకు జీవితంలో అర్హుడినా అని ఆలోచిస్తున్నాను. జనవరి 13న నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది.” అంటూ ట్వీ్ట్ చేశారు. దీంతో సైంధవ్ సినిమాపై మరిన్ని అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos