Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPI Narayana: బిగ్ బాస్ షో నిర్వాహకులపై నారాయణ సీరియస్

CPI Narayana: బిగ్ బాస్ షో నిర్వాహకులపై నారాయణ సీరియస్

Phani CH

|

Updated on: Dec 20, 2023 | 9:44 AM

బిగ్ బాస్ అంటేనే వివాదాల సుడిగుండం. హౌస్‌లో కంటెస్ట్‌ల ఆటలైనా.. పాటలైనా.. వాళ్లేం చేసినా కేరాఫ్‌ కాంట్రవర్శీనే. ఆ సంగతి అలా ఉంటే.. వాళ్ల అభిమాన సంఘాల అడ్డగోలు గగ్గోలు మరో లెవెల్‌. సోషల్ మీడియాలో వాళ్లు చేసే అతి అంతకుమించి నీచం అనేలా ఉంటుంది. లేటెస్ట్‌గా బిగ్ బాస్ -7 సీజన్‌ క్లైమాక్స్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. హౌస్‌లో ప్లేయర్లు కుస్తీకి దిగినట్టే.. రియల్‌ లైఫ్‌లో అభిమానులు హద్దులు దాటారు. 105 రోజుల పాటు సాగిన రియాల్టీ షోలో విజేతగా పల్లవి ప్రశాంత్‌.

బిగ్ బాస్ అంటేనే వివాదాల సుడిగుండం. హౌస్‌లో కంటెస్ట్‌ల ఆటలైనా.. పాటలైనా.. వాళ్లేం చేసినా కేరాఫ్‌ కాంట్రవర్శీనే. ఆ సంగతి అలా ఉంటే.. వాళ్ల అభిమాన సంఘాల అడ్డగోలు గగ్గోలు మరో లెవెల్‌. సోషల్ మీడియాలో వాళ్లు చేసే అతి అంతకుమించి నీచం అనేలా ఉంటుంది. లేటెస్ట్‌గా బిగ్ బాస్ -7 సీజన్‌ క్లైమాక్స్‌లోనూ అదే సీన్ రిపీట్ అయింది. హౌస్‌లో ప్లేయర్లు కుస్తీకి దిగినట్టే.. రియల్‌ లైఫ్‌లో అభిమానులు హద్దులు దాటారు. 105 రోజుల పాటు సాగిన రియాల్టీ షోలో విజేతగా పల్లవి ప్రశాంత్‌.. రన్నరప్‌గా అమర్‌దీప్‌ నిలిచాడు. ఇక్కడే రాద్ధాంతం మొదలైంది. ప్రశాంత్‌-అమర్‌దీప్‌ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి వాదులాటకు దిగారు. టైటిల్ తమకు దక్కాల్సిందని అమర్‌దీప్‌ అభిమానులు.. సత్తా ఉన్న వాడికే టైటిల్ దక్కిందని ప్రశాంత్ ఫ్యాన్స్‌ నినాదాలు చేసుకున్నారు. ఇదికాస్త గొడవకు దారితీసింది. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అనంతరం జరిగిన సంఘటనలపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. అసలు బిగ్‌బాస్‌ షోని బ్యాన్ చేయాలని మరో సారి డిమాండ్ చేశారాయన.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prince Yawar: సూట్‌కేస్.. ఎందుకు తీసుకున్నావ్ ?? దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన యావర్

దావుద్‌తో దిగిన ఒక్క ఫోటో.. ఈ హీరోయిన్ కెరీర్‌ను ముంచేసింది..

Extra Ordinary Man: ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్