Bheemla Nayak Song: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పై వివాదం.. అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు(వీడియో)

|

Sep 05, 2021 | 5:58 PM

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్‌ సినిమా టైటిల్‌ సాంగ్‌పై వివాదం నెలకొంది. పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్‌ సాంగ్‌పై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. పవన్‌ కళ్యాణ్‌- రానా క్రేజీ కాంబోలో త్రివిక్రమ్ రచనా సారథ్యంలో.. సాగర్‌ చంద్ర డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ సినిమాకు రీమేక్‌గా వస్తున్న.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ నిర్మిస్తుంది. అయితే సెప్టెంబర్ 2 తేదీ పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు పవన్. కాగా చిత్రయూనిట్‌ విడుదల చేసిన భీమ్లా నాయక్‌ టైటిల్ సాంగ్ పై వివాదం నెలకొంది. ఈ పాట పై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ పాట పై తెలంగాణ పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని కొన్ని పదాలు తెలంగాణ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ డీసీపీ రమేష్ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణ పోలీసులు పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసులు, తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగొట్టం. పాట రచయితకు ఒక పోలీస్‌ గురించి వివరించేందుకు తెలుగులో ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టున్నాయి’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై ఫాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి చిత్రయూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.YouTube video player
మరిన్ని ఇక్కడ చూడండి: Solar Storm: భూమికి త్వరలో ముప్పు.. అదే జరిగితే ఇంటర్నెట్‌ బంద్‌.. ఆందోళన కలిగిస్తున్న శాస్త్రవేత్తల రిపోర్టు(వీడియో).

Tokyo Paralympics video: అంగవైకల్యం అతని ముందు తలొంచింది.. చేతులు లేకపోయినా 4 బంగారు పతకాలు..(వీడియో)

Viral Video: దక్షిణ ఆస్ట్రేలియాలో అద్భుత లోకం..! ఇది గ్రాఫిక్స్‌ కానే కాదు.. సరస్సు వీడియో…

Taliban Video: పంజ్‌షేర్‌ లోయలో వార్‌ వన్‌ సైడ్‌.! వందలాది మంది తాలిబన్లు మృతి…